Rashi khanna: కెరీర్ లో తొలిసారిగా అలాంటి భయంకరమైన పాత్రలో కనిపించబోతున్న రాశిఖన్నా?

Rashi khanna: టాలీవుడ్ హీరోయిన్ రాశిఖన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె టాలీవుడ్లో పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది. రాశిఖన్నా కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా మామూలుగా లేదు. ఇక సోషల్ మీడియాలో ఈమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇది ఇలా ఉంటే రాశి ఖన్నా, సుందర్ సి, ఆర్య , ఆండ్రియా హీరో హీరోయిన్ గా నటించిన తాజా తమిళ చిత్రం అరణ్మణై 3.ఈ సినిమాకు సుందర్.సి దర్శకత్వం వహించారు.

ఈ సినిమా ఉదయనిధి స్టాలిన్, ఏ పీ ఎస్ అరుణ్ కుమార్, కుష్బూ సమర్పణలో రూపొందిన ఈ సినిమా తెలుగులో అంతఃపురం పేరుతో విడుదల కానుంది. ఈ సినిమాను గంగ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు సుందర్.సి మాట్లాడుతూ.. కెరీర్ లో రాశి ఖన్నా నటించిన తొలి హారర్ కామెడీ సినిమా అంతఃపురం.అరణ్మణై సినిమా తమిళంలో రిలీజ్ అయి మంచి స్పందన వచ్చింది. అంతఃపురం సినిమా పై కూడా తెలుగు లో భారీగా అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఇతర వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. ఆద్యంతం నవ్విస్తూనే భయపెడుతుంది. ఓ అంతఃపురం లో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలేమిటి. అందులోని ఆత్మ ఎవరి పై ప్రతీకారం తీర్చుకోవడానికి ఎదురుచూస్తుంది అనేది ఉత్కంఠను పెంచుతుంది. సాక్షి అగర్వాల్,వివేక్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతాన్ని సత్య సి అందించారు. కాకపోతే రాశికన్నా సినిమాల విషయానికి వస్తే.. ఈమె తెలుగులో శివమ్, తొలిప్రేమ ప్రతి రోజు పండగే సుభాష్ లాంటి చిత్రాలలో నటించింది.