బాలయ్య, రోజాకు మాత్రమే సొంతమైన అరుదైన రికార్డ్ ఏంటో మీకు తెలుసా?

స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ, రోజా కాంబినేషన్ లో చాలా సినిమాలు తెరకెక్కాయనే సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలలో కొన్ని సినిమాలు సంచలన విజయాలను సొంతం చేసుకుంటే మరికొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాపులుగా నిలిచాయి. అయితే బాలయ్య, రోజా అని రకాల జానర్ లలో నటించడం గమనార్హం. భైరవద్వీపం సినిమాతో బాలయ్య రోజా కాంబినేషన్ మొదలైంది.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించడంతో పాటు అటు బాలయ్యకు రోజాకు ఈ సినిమా ద్వారా మంచి పేరు వచ్చింది. ఈ సినిమాలో కొంత సమయం పాటు బాలయ్య కురూపి పాత్రలో కనిపించారు. భైరవద్వీపం సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడంతో బాలయ్య రోజా కాంబినేషన్ ను రిపీట్ చేయాలని చాలామంది దర్శకులు భావించారు. ఈ కాంబినేషన్ లో రెండో సినిమాగా గాండీవం సినిమా తెరకెక్కింది.

భారీ అంచనాలతో విడుదలైన గాండీవం సినిమా ప్రేక్షకుల అంచనాలను మాత్రం అందుకోలేదు. గాండీవం సినిమా ఫ్లాపైనా బొబ్బిలి సింహం సినిమాలో ఈ కాంబినేషన్ రిపీట్ అయింది. ఈ సినిమాతో ఈ కాంబినేషన్ లో సక్సెస్ చేరింది. ఆ తర్వాత మాతో పెట్టుకోకు, శ్రీ కృష్ణార్జున విజయం, పెద్దన్నయ్య, సుల్తాన్ సినిమాలలో బాలయ్య రోజా కలిసి నటించడం గమనార్హం.

ఈ సినిమాలలో కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ను సొంతం చేసుకుంటే కొన్ని సక్సెస్ కాలేదు. ఈ విధంగా అన్ని రకాల జానర్ లలో బాలయ్య రోజా నటించి అరుదైన రికార్డును సొంతం చేసుకోవడం గమనార్హం. బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో నటిస్తున్నారు. బాలయ్య అనిల్ రావిపూడి డైరెక్షన్ లో కూడా ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.