రంగ రంగ వైభవంగ తెలుగు మూవీ రివ్యూ

నటీనటులు: పంజా వైష్ణవ తేజ్, కేతిక శర్మ, నవీన్ చంద్ర, సుబ్బరాజు, ప్రభు, నరేష్, రఘు బాబు

దర్శకత్వం : గిరీశాయ

నిర్మాతలు: బివిఎస్ఎన్ ప్రసాద్

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ తేజ్ తన తొలి సినిమా ‘ఉప్పెన’ తో భారీ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన ‘కొండపోలం’ పర్వాలేదనిపించింది. సినిమాల్లోకి వచ్చిన ఒక సంవత్సరం లోనే వైష్ణవ తేజ్ మూడో సినిమా కూడా రిలీజ్ చేసాడు. అదే ‘రంగ రంగ వైభవంగా’. మొదటి రెండు సినిమాలకు బిన్నంగా ఈ సారి ఫామిలీ ఎంటర్టైనర్ తో మన ముందుకు వచ్చాడు, సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథ:

రిషి, రాధ చిన్ననాటి స్నేహితులు. ఎంతో స్నేహంతో, ప్రేమతో కలిసి, మెలిసి ఉండే వీళ్ళ జీవితం లో ఒక అనుకోని సంఘటన చోటు చేసుకుంటుంది. ఆ సంఘటన వల్ల ఇద్దరూ బద్ధ శత్రువులుగా మారుతారు. బాల్యం లో ఒక చిన్న సమస్యతో, తమలో ఎవరైనా మౌనాన్ని బ్రేక్ చేసేవరకు ఒకరితో ఒకరు మాట్లాడకూడదని డిసైడ్ అయిపోతారు. ఇద్దరి కుటుంబాలు చాలా సన్నిహితంగా ఉన్నప్పటికీ, వాళ్ళిద్దరి మధ్య విభేదాలను పరిష్కరించడానికి వారు ఎంత ప్రయత్నించినా, రిషి, రాధల ఇగో పెరుగుతూనే ఉంటుంది. ఇంత ద్వేషం, అహంభావం మధ్య వాళ్లిద్దరూ తమ ద్వేషాల్ని ఎలా పక్కనపెట్టి కలుసుకుంటారు అనేది మిగతా కథ.

సినిమా ఎలా ఉంది….

ఇలాంటి సినిమాలు తెలుగు లో చాలా వచ్చాయి. సినిమా మొదలవగానే ఈ సినిమా ఎలా ఉండబోతుందోమో….తర్వాత వచ్చే సీన్స్ ఏంటో ఈజీ గా కనిపెట్టెయ్యొచ్చు. ఈ సినిమాలో ఫ్రెండ్‌షిప్, లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్, ఫైట్స్, సాంగ్స్ ఇలా అన్నీ ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే అంశాలు ఉన్నాయి. అయితే ఇలాంటి సినిమాలు చూసిన జనాలకు కొత్తగా ఏమి అనిపించదు.

టెక్నికల్ గా సినిమా బాగానే ఉన్నప్పటికీ, సినిమా మాత్రం ఏ మాత్రం ఆడియన్స్ ని ఎంటర్టైన్ చెయ్యదు. దేవి శ్రీ ప్రసాద్ పాటలు గుర్తుంచుకునేలా లేవు. ఈ మధ్య కాలం లో ‘పుష్ప’ తప్ప దేవి సినిమా పాటలు అలరించలేకపోతున్నాయి.

తమిళ్ లో ‘అర్జున్‌రెడ్డి’ రీమేక్‌తో సక్సెస్‌ని ఇచ్చిన దర్శకుడు గిరీశయ్య, తెలుగు ప్రేక్షకులకు కొత్త కంటెంట్‌ని అందించడంలో విఫలమయ్యాడు. ‘రంగ రంగ వైభవంగ’ సినిమాలో ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకర్షించే అన్ని అంశాలు ఉన్నప్పటికీ, ఈ సినిమా తీవ్రంగా నిరాశపరుస్తుంది.

ఓవరాల్‌గా, రంగ రంగ వైభవంగా ఒక యావరేజ్ సినిమా, ఫస్ట్ హాఫ్ బాగున్నప్పటికీ….సెకండ్ హాఫ్ చాలా తల నొప్పిగా ఉంటుంది. అస్సలే జనాలు థియేటర్స్ కి వెళ్లాలంటే వెయ్యిసార్లు ఆలోచిస్తున్నారు, మరి ఈ సినిమా ఏ మాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి.