సొంత బ్యానర్ లోనే మొహం చూపించుకో లేకపోయాడు.. రానా పై నెటిజన్ షాకింగ్ కామెంట్?

వేణు ఉడుగుల దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో సాయి పల్లవి రానా హీరోహీరోయిన్లుగా నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన చిత్రం విరాటపర్వం. ఈ సినిమా ఈ నెల 17వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రబృందం పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొని బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే తాజాగా ఈ సినిమా ట్రైలర్ జూన్ 5వ తేదీ విడుదల చేయనున్నట్లు సురేష్ ప్రొడక్షన్స్ అధికారకంగా తెలియజేశారు.

ఈ విషయాన్ని సురేష్ ప్రొడక్షన్స్ అధికారికంగా తెలియజేస్తూ ఒక పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ లో రానా మొహం కనిపించకుండా సాయి పల్లవిని హత్తుకున్నట్టు చూపించారు.ఈ క్రమంలోనే ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి పలు చర్చలకు కారణమైంది.ఈ ఫోటో చూసిన పలువురు నెటిజన్లు కనీసం తన సొంత బ్యానర్లో చేసిన సినిమాల్లో కూడా తన మొహం చూపించుకోలేక పోతున్నాడు. ఇలా తక్కువ నిడివి ఉన్న పాత్రలు చేయడం ఎందుకు అవమానాలు పడటం ఎందుకు అంటూ కామెంట్ చేశారు.

ఈ విధంగానే నెటిజన్ చేసిన కామెంట్ పై రానా స్పందిస్తూ తనదైన శైలిలో సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా రానా సమాధానం చెబుతూ మనం కాస్త తగ్గి కథకు హీరోయిన్ పాత్రను ఎలివేట్ చేయడంలో వచ్చే కిక్కే వేరు.ఇలాంటి పనులు చేయాలంటే సొంత బ్యానర్లోనే వీలవుతుంది అంటూ సమాధానం చెప్పారు. ఈ విధంగా రానా చెప్పిన సమాధానం అందరిని ఎంతగానో ఆకట్టుకుంది.