అబ్బో… రానా ముంబైలో జీవితం ఆ “హీరో” తోనే గడిపాడంట

rana shares his friendshio with akshay kumar

తెలుగు హీరో రానాకు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు ఉంది. బాలీవుడ్ ప్రముఖుల్లో రానాకు మంచి పరిచయాలున్నాయి. గత మూడు నాలుగు సంవత్సరాలుగా బాలీవుడ్ నెం.1 హీరోగా కొనసాగుతూ ఉన్న అక్షయ్ కుమార్ తో సైతం రానాకు చాలా మంది స్నేహం ఉందట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే నో ఫిల్టర్ నేహా షో లో చెప్పుకొచ్చాడు. గతంలో అక్షయ్ కుమార్ తో కలిసి బేబీ మరియు హౌస్ ఫుల్ 4 సినిమాల్లో నటించాడు. ఆ రెండు సినిమాల షూటింగ్స్ సమయంలో జరిగిన సరదా సంఘటనలు టాక్ షో సందర్బంగా గుర్తు చేసుకున్నాడు.

rana shares his friendshio with akshay kumar

ముంబయిలో తాను ఉన్న జీవిత కాలంలో సగం రోజులు అక్షయ్ కుమార్ తోనే గడిపినట్లుగా చెప్పుకొచ్చాడు. ఎప్పుడు ముంబయి వెళ్లినా కూడా అక్షయ్ ను కలవడం జరుగుతుందని రానా పేర్కొన్నాడు. ముంబయిలో ఉన్న సమయంలో నన్ను ఉదయం 5.45 కే రేడియో షోకు తీసుకు వెళ్లేవాడంటూ రానా పేర్కొన్నాడు. ఈ టాక్ షో లో అక్షయ్ కుమార్ తో తన అనుబంధం.. ప్రస్తుతం బాలీవుడ్ లో చేస్తున్న సినిమాలతో పాటు ఇంకా పలు విషయాలను కూడా మాట్లాడాడు.

Rana shares his relationship with akshay
Rana shares his relationship with akshay

పెళ్లి గురించి మాట్లాడుతూ కేవలం 30 మంది బంధు మిత్రులతో తన పెళ్లి జరిగిందన్నాడు. తన ఇంటి నుండి పెళ్లి మండపం కేవలం అయిదు నిమిషాల జర్నీ మాత్రమే అన్నాడు. పెళ్లికి రాలేక పోయిన స్నేహితులకు వర్చువల్ రియాల్టీ ద్వారా చూసేలా ఏర్పాట్లు చేశామన్నాడు.

ప్రస్తుతం రానా అరణ్య: సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నాడు. ఆ సినిమా కాకుండా ‘విరాటపర్వం’ సినిమా కూడా చేస్తున్నాడు. ఈ సినిమాలు కాకుండా ఇంకా కొన్ని సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నాయి. త్వరలో రానా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత రానా కొత్త సినిమాలను ప్రకటించే అవకాశం ఉంది.