రామ్ కొత్త సినిమాకు క్రేజీ టైటిల్

Ram's next titled as Ustaad

Ram's next titled as Ustaad

ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుని ఎనర్జిటిక్ స్టార్ రామ్ కాస్త ఉస్తాద్ రామ్ అయిపోయాడు. ఈ సినిమాతో యాక్షన్ హీరోగా సెటిలవ్వానుకున్న రామ్ ఆశలకు గట్టి పునాది పడింది. ఈ ఊపులోనే ఒక మాంచి మాస్ సినిమా చేయాలని లింగుస్వామికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. లింగుస్వామి కూడ రామ్ అభిరుచికి తగ్గట్టే కథ తయారుచేశారు. రామ్ సైతం కథ పట్ల చాలా ఎగ్జైట్ అవుతున్నాడు. ఇందులో ఫ్యాక్షన్ ఛాయలు కూడ ఉంటాయట. భారీ వ్యయంతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూట్ మొదలుకానుంది. ఇందులో కృతి శెట్టి కథానాయకిగా నటిస్తోంది.

సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ కాబట్టి టైటిల్ కూడ అలాగే ఉండాలని భావించిన టీమ్ ‘ఉస్తాద్’ అనే పేరును పరిశీలిస్తోంది. ఉస్తాద్ అనేది రామ్ ట్యాగ్ నేమ్. ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో ఎనర్జిటిక్ స్టార్ అనే ట్యాగ్ ను ఉస్తాద్ అని మార్చుకున్నాడు రామ్. ప్రేక్షకుల్లో ఆ పదం బాగా రిజిస్టర్ అయింది కూడ. బహుశా అందుకే అదే పేరును సినిమాకు కూడ పెట్టుకుని ఉండొచ్చు. సోషల్ మీడియాలో సైతం ఉస్తాద్ అనే పేరు చాలాబాగుందని కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. భారీ వ్యయంతో నిర్మితమవుతున్న ఈ సినిమాతో సాలిడ్ మార్కెట్ క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు రామ్.