ఎక్స్ ట్రా జబర్దస్త్ ను కాస్తా శ్రీదేవి డ్రామా కంపెనీ గా మార్చిన రాంప్రసాద్..!

బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్య క్రమానికి ఎంతో కీలకంగా ఉన్నటువంటి జడ్జి రోజా మంత్రి పదవి రావడంతో ఈ కార్యక్రమం నుంచి తప్పుకున్నారు. ఈ క్రమంలోనే ఆమె స్థానాన్ని ఇంద్రజ పూర్తిచేశారు. జబర్దస్త్ కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చినటువంటి ఇంద్రజ ఎట్టకేలకు ఈ కార్యక్రమానికి జడ్జిగా ఫిక్స్ అయిపోయారు. ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో నిర్మాతగా వ్యవహరిస్తున్నటువంటి ఇంద్రజ సుధీర్ తో సన్ అండ్ మదర్ రిలేషన్ లో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈమె శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎంట్రీ అయినప్పుడు సుధీర్ తన చేయి పట్టుకుని తీసుకెళ్తూ కుర్చీలో కూర్చోబెట్టడం అలాగే ఆ కార్యక్రమంలో కంటెస్ట్ చేసే పర్ఫామెన్స్ లలో లీనమైపోయి ఆ పాటలను డాన్సులను ఎంతో ఆస్వాదిస్తూ ఉంటారు.

అయితే ఇంద్రజ ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమానికి గెస్ట్ గా రావడంతో శ్రీదేవి డ్రామా కంపెనీ లో ఆమె ఎలా వ్యవహరించేదో దానిని సుడిగాలి సుధీర్ స్కిట్ చేసి చూపించారు.ఈ క్రమంలోనే ఆటో రాంప్రసాద్ ఇంద్రజ గెటప్ వేస్తూ ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి కాస్త శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంగా మార్చేశారు. రాంప్రసాద్ ఎంట్రీ ఇవ్వగానే సుడిగాలి సుదీర్ ఇంద్రజ గెటప్లో ఉన్న ఆటో రాంప్రసాద్ చెయ్యి పట్టుకుని కుర్చీలో కూర్చో పెడతారు. ఈ సంఘటన చూసిన ఇంద్రజ ఎంతో నవ్వుకుంటుంది.

ఇక ఆటో రాంప్రసాద్ మాట్లాడుతూ…నువ్వు అలా చెయ్యి పట్టుకుని వస్తుంటే నా వయసు ఎక్కువగా ఉందని అందరూ అనుకుంటున్నారు. నీ క్లోజప్ షాట్స్ కోసం నాకు వయసు పెంచకు అంటూ సుధీర్ పై పంచ్ వేస్తుంది. అలాగే ఆటో రాంప్రసాద్ అచ్చం ఇంద్రజ మాదిరిగానే డాన్స్ వేయడంతో ఆమె రామ్ ప్రసాద్ డాన్స్ చూసి తల పట్టుకున్నారు. ఇక ఈ స్కిట్ లో అందరూ పర్ఫార్మెన్స్ చేయగా ఇంద్రజ ఎలాగైతే జడ్జిమెంట్ ఇస్తుందో ఆటో రాంప్రసాద్ అలాగే జడ్జిమెంట్ ఇవ్వడంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.