ప్రైమ్ టైమ్ టెలివిజన్‌లో కంగనా రనౌత్ ఊర్మిళ మాటోండ్కర్ పై చేసిన వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మరోసారి వివాదం మొదలైంది. గత కొన్ని నెలలుగా బాలీవుడ్ అసమానమైన అలజడి నెలకొని వుంది. పార్లమెంటులో పరిశ్రమ పేరును కించపరచడానికి ప్రయత్నిస్తున్న వారిని జయ బచ్చన్ ప్రస్తావించడంవల్ల ఈ వివాదం మరోసారి పెరిగింది. ఇదే వ్యాఖ్యలపై కంగనా రనౌత్ జయ బచ్చన్ పై తీవ్రంగా మండిపడ్డారు.
అయితే, బాలీవుడ్ అంతా ‘మాదకద్రవ్యాల బానిసలు’ అని కంగనా ఆరోపించడాన్ని ఉర్మిలా మాటోండ్కర్ ఒక ఇంటర్వ్యూలో తీవ్రంగా కందించారు. కంగనా తన రాష్ట్ర హిమాచల్ ప్రదేశ్‌లో డ్రగ్స్ వాడకం గురించి మొదట మాట్లాడాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. ఊర్మిళ వ్యాఖ్యలతో చిరాకెత్తి కంగనా ఉర్మిళను ఒక జాతీయ టెలివిజన్లో ఉర్మిళను ‘సాఫ్ట్ పోర్న్ స్టార్’ అని వ్యాఖ్యానించింది.
ఇదే విషయం పై ఉర్మిళకు మద్దతుగా బాలీవుడ్ సెలబ్రిటీలు చాలా మంది బయటకు రాగా, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఆమెకు మద్దతు ఇచ్చారు. ట్విట్టర్‌లోకి రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేస్తూ, “ఎవరితోనూ గొడవ పడడానికి ఇష్టపడటం లేదు, రంగీలా, సత్య, కౌన్, భూట్, ఎక్ హసీనా తి వంటి విభిన్న సంక్లిష్టమైన పాత్రలను పోషించడంలో ఊర్మిళ మాతోండ్కర్ తన బహుముఖ ప్రతిభను నిరూపించారని నేను నమ్ముతున్నాను ” చెప్పుకొచ్చారు.
ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉర్మిలా ఇలా అన్నారు, “దేశం మొత్తం మాదకద్రవ్యాల భయాన్ని ఎదుర్కొంటోంది. హిమాచల్ డ్రగ్స్ కి మూలం అని ఆమెకు (కంగనా) తెలుసా? ఆమె తన సొంత రాష్ట్రం నుండే డ్రగ్స్ మీద పోరాటం ప్రారంభించాలి. “ఊర్మిళ మాటోండ్కర్ కు మద్దతుగా స్వరా భాస్కర్, అనుభవ్ సిన్హా, పూజా భట్ మరియు ఫరా ఖాన్ అలీ తదితరులు ఉన్నారు.
Not wanting to get into slanging matches with anyone, I believe that @UrmilaMatondkar has more than proved her versatile talent in enacting such diversely complex roles as in RANGEELA,SATYA,KAUN,BHOOT,EK HASEENA THI etc .https://t.co/xjiSUW2kdB
— Ram Gopal Varma (@RGVzoomin) September 17, 2020