Home News రామప్ప ఘనత ఎవరిది.? బీజేపీదా.? టీఆర్ఎస్‌దా.?

రామప్ప ఘనత ఎవరిది.? బీజేపీదా.? టీఆర్ఎస్‌దా.?

Ramappa Temple Who Will Get The Credit | Telugu Rajyam

చారిత్రక కట్టడం, హిందూ దేవాలయం ‘రామప్ప’కి యునెస్కో గుర్తింపు దక్కింది. రామప్ప దేవాలయం ఈ ఘనతను సాధించడం వెనుక, చాలా పెద్ద కథే నడిచింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయమై చేసిన కృషిని అభినందించాల్సిందే. తెలంగాణలోని ప్రస్తుత ములుగు జిల్లాలో వుందీ రామప్ప దేవాలయం. అయితే, ఎన్నో దశాబ్దాలుగా రామప్ప దేవాలయం నిర్లక్ష్యానికి గురయ్యిందన్నది బహిరంగ రహస్యం. అటు కేంద్రంగానీ, ఇటు రాష్ట్రంగానీ.. రామప్ప దేవాలయ పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోలేదన్న విమర్శలున్నాయి. ఇప్పుడు యునెస్కో గుర్తింపుతో, ప్రధాన రాజకీయ పార్టీలు ‘ఆ ఘనత మాది..’ అంటూ రాజకీయ కొట్లాటకు తెరలేపాయి. అక్కడికేదో, కేంద్ర ప్రభుత్వమో.. రాష్ట్ర ప్రభుత్వమో ఈ దేవాలయాన్ని నిర్మించినట్లుగా తయారైంది పరిస్థితి.

రామప్ప దేవాలయ విశేషాల్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత శ్రద్ధ పెట్టాయి.? అన్నదానికంటే, పర్యాటకులు.. మరీ ముఖ్యంగా భక్తులు.. ఈ దేవాలయ ఖ్యాతిని ప్రపంచ వ్యాపితం చేసేందుకు చాలా చాలా కష్టపడ్డారు. సోషల్ మీడియా వేదికగా రామప్ప దేవాలయ ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేసేందుకు ప్రపయత్నించారు. అలా రామప్ప దేవాలయ ఖ్యాతి ప్రపంచ వ్యాపితమయ్యింది. తెలుగు రాష్ట్రాల నుంచి యునెస్కో గుర్తింపు పొందిన మొట్టమొదటి చారిత్రక కట్టడం రామప్ప దేవాలయం. ఇందుకు తెలుగువారంతా గర్వపడాల్సిందే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. బీజేపీ, టీఆర్ఎస్ ఈ విషయంలో రాజకీయంగా ఆధిపత్య పోరుకి దిగితే అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.? తెలుగు రాష్ట్రాల్లో ఇంకా చాలా చాలా చారిత్రక కట్టడాలున్నాయి. వాటిల్లో కొన్నిటికైనా యునెస్కో గుర్తింపు దక్కితే, ఆ దిశగా రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు కృషి చేస్తే మంచిది.

Related Posts

బిగ్ బాస్ తెలుగు: అప్పుడు అవినాష్, ఇప్పుడు రవి.!

బిగ్ బాస్ రియాల్టీ షో తెలుగు సీజన్ 5 విషయానికొస్తే, చిత్ర విచిత్రంగా కనిపిస్తోంది కంటెస్టెంట్ల తీరు బిగ్ హౌస్‌లో. సుదీర్ఘమైన నామినేషన్ల ప్రక్రియ.. సుదీర్ఘమైన టాస్కులు.. ఇవేవీ వీక్షకులకు 'కిక్కు' ఇవ్వలేకపోతున్నాయి....

Related Posts

Latest News