Annapoorna: రామానాయుడి గారి బ్యానర్‌లో సురేశ్ ప్రొడక్షన్‌లో అప్పటికీ శారద గారు, జమున గారు లాంటి రెగ్యులర్‌గా ఉన్న ఆర్టిస్ట్‌ల తర్వాత కంటిన్యూ అని కాకుండా అవసరం ఉన్నపుడు మాత్రం తనను పిలిచారని ప్రముఖ సీనియర్ నటి అన్నపూర్ణమ్మ అన్నారు. రామానాయుడి గారి సినిమాల్లో సీనియర్ నటులు ఎంతమంది ఉన్నా ఆయనకున్న లేటెస్ట్ మెంటాలిటీ కారణంగా లేటెస్ట్‌గా వచ్చిన వాళ్లను కూడా సినిమాలో పెడతారని ఆమె చెప్పారు.
ఇకపోతే రామానాయుడి గారి చిత్రాల్లో 75 శాతం పాత వాళ్లకు ఛాన్స్ ఇస్తే, 25శాతం కొత్త వాళ్లకు అవకాశం ఇస్తారని ఆమె అన్నారు. తాను ముందడుగు సినిమాలో చేసిన తర్వాత చాలా మదర్ వేషాలు తనతో వేయించారని అన్నపూర్ణమ్మ అన్నారు. ఆ తర్వాత తాను కొంచెం బిజీ కావడం వల్ల చేయలేకపోయానని ఆమె చెప్పారు. ఇప్పటికీ ఆయన బ్యానర్‌లో ఒక్క రోజు చేయాల్సి ఉన్నా తనని పిలుస్తారని ఆమె అన్నారు. వాళ్ల పిల్లలు కూడా తనను పిలుస్తారని ఆమె చెప్పారు.
ఇదిలా ఉండగా రక్త సింధూరం సినిమాకు గాను రాజమండ్రి జైలులో చాలా రోజులు షూటింగ్ చేశామని అన్నపూర్ణమ్మ అన్నారు. చిరంజీవి డబుల్ రోల్ చేసిన ఆ సినిమాలో ఆయన పాత్ర తనకు చాలా ఇష్టమని ఆమె చెప్పారు. ఎన్ని సినిమాలు చేసినా, ఎన్ని పాత్రలు పోషించినా మనల్ని మనం మెచ్చుకోవడం కాదు. అది ఇంకొకరికి నచ్చాలి అని ఆమె స్పష్టం చేశారు.