గరికపాటి పై రామ్ గోపాల్ వర్మ ఫైర్

ఏ చిన్న విషయాన్నైనా కాంట్రవర్సీ చెయ్యడం రామ్ గోపాల్ వర్మ కి అలవాటు. బహుశా సోషల్ మీడియా ని రామ్ గోపాల్ వర్మ లా వాడుకోవడం ఎవ్వరికి తెలియదేమో. తాజాగా రాము గరికపాటి మీద ఫైర్ అయ్యాడు.

కొన్నిరోజుల క్రితం ఒక ఈవెంట్ లో చిరంజీవి తో ఫ్యాన్స్ ఫొటోస్ దిగుతుంటే గరికపాటి అసహనం వ్యక్తం చేసాడు. చిరంజీవి గారు మీరు ఫోటోలు ఆపండి లేకుంటే నేను వెళ్ళిపోతాను అన్నాడు. దీనికి నాగ బాబు గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. అలాగే చోట కే నాయుడు కూడా గరికపాటి మీద సటైర్ వేసాడు. తర్వాత నాగ బాబు మెగా ఫాన్స్ ని గరికపాటిని ట్రోల్ చెయ్యొద్దు అంటూ రిక్వెస్ట్ చేసాడు.

నాగబాబు చేసిన ట్వీట్ పై వర్మ స్పందిస్తూ క్షమించండి నాగబాబు మెగాస్టార్ చిరంజీవి అవమానించిన గుర్రంపాటిని వదిలే ప్రసక్తే లేదు.మా దృష్టిలో ఎవరు చిరంజీవిని అవమానించిన వారు గడ్డిపరకతో సమానం.తగ్గేదేలే అంటూ వరుస త్వీట్లు చేస్తూ మరోసారి ఈ వివాదానికి వర్మ ఆజ్యం పోసారని తెలుస్తోంది.మరి ఈ వివాదం ఇక్కడితో ఆగుతుందా లేదా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం వర్మ చేసిన ఈ ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.