రామ్ ది వారియర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. విడుదల ఎప్పుడంటే?

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మరోసారి ఫామ్ లోకి వచ్చిన రామ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తమిళ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ఈయన మొట్టమొదటిసారిగా ది వారియర్ అనే ద్విభాషా చిత్రంలో నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఎన్నో పాటలు, పోస్టర్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.ఇక ఈ సినిమా నుంచి విడుదలైన బుల్లెట్ సాంగ్ పాట విపరీతమైన ట్రెండ్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ మేకర్స్ రిలీజ్ చేశారు.

ఈ సినిమాని జులై 14వ తేదీ విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారకంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే జులై 1వ తేదీ ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరుగనుంది. శుక్రవారం సాయంత్రం 7.57గంటలకు ట్రైలర్‌ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారకంగా ప్రకటించారు. ఇక ఈ సినిమాలో రామ్ సరసన కృతి శెట్టి నటించారు. ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

దేవి శ్రీ సంగీత సారథ్యంలో విడుదలైన పాటలు ఎంతో అద్భుతంగా ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి ఇకపోతే బుల్లెట్ సాంగ్ ఇప్పటికే వంద మిలియన్ వ్యూస్ కి పైగా సాధించి రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఈ పాటను తమిళ హీరో శింబు పాడడం గమనార్హం. ఇలా ఈ సినిమా నుంచి తరచూ ఏదో ఒక అప్డేట్ విడుదల చేస్తూ సినిమాపై భారీ అంచనాలను పెంచారు. ఇక ఈ సినిమాలో రామ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో సందడి చేయనున్నారు.మొదటిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న రామ్ ప్రేక్షకులను ఎలా మెప్పిస్తారో తెలియాల్సి ఉంది.