ఫ్యాక్షన్లో రామ్ కొత్త పోకడలు

Ram trying to new style in faction
Ram trying to new style in faction
 
ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుని ఎనర్జిటిక్ స్టార్ రామ్ కాస్త ఉస్తాద్ రామ్ అయిపోయాడు.  ఈ సినిమాతో యాక్షన్ హీరోగా సెటిలవ్వానుకున్న రామ్ ఆశలకు గట్టి పునాది పడింది.  ఈ ఊపులోనే ఒక మాంచి మాస్ సినిమా చేయాలని లింగుస్వామికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. లింగుస్వామి కూడ రామ్ అభిరుచికి తగ్గట్టే కథ తయారుచేశాడట. లింగుస్వామి అల్లు అర్జున్ తో వర్క్ చేయలనుకున్నారు.  కానీ అది సెట్టవ్వలేదు. అందుకే రామ్ సినిమా అవకాశాన్ని గట్టిగా వాడుకుని సత్తా నిరూపించుకోవాలని చూస్తున్నారు. ఇంతకీ రామ్ తో ఆయన చేయనున్న సబ్జెక్ట్ ఎంతో తెలుసా.. ఫ్యాక్షన్ సబ్జెక్ట్.  
 
రామ్ ఇంతవరకు ఫ్యాక్షన్ నేపథ్యంలో సినిమా చేయలేదు. గతంలో రాయలసీమ నేపథ్యంలో సినిమా చేసినా అవి కంప్లీట్ ఎంటర్టైనర్లు. కానీ లింగుస్వామి కథ అలా కాదట.  పూర్తిస్థాయి ఫ్యాక్షన్ ఫ్లేవర్.  యాక్షన్ కంటెంట్ బలంగా ఉంటుందని, కథ కూడ డిఫరెంట్ అటెంప్ట్ అని తెలుస్తోంది. మరి ఈ భిన్నమైన కొత్త ప్రయత్నం రామ్ కెరీర్ ను ఎలా మలుపుతిప్పుతుందో చూడాలి. ఇకపోతే ఇందులో ‘ఉప్పెన’ ఫేమ్ కృతి శెట్టి కథానాయికగా నటించనుంది.  లాక్ డౌన్ ముగిసిన వెంటనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నారు టీమ్.