Ram Pothineni: నక్క తోక తొక్కిన రామ్ పోతినేని.. ఒకేసారి ఏకంగా ఆరు ఆఫర్స్.. డైరెక్టర్స్ వాళ్లే!

Ram Pothineni: తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రామ్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. తెలుగులో ఇప్పటికే చాలా సినిమాలలో నటించిన రామ్ పోతినేని తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు. సినిమా హిట్,ప్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఇకపోతే రామ్ పోతినేని చివరగా డబుల్ ఇస్మార్ట్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ విజయం అందుకుంటుందని మూవీ మేకర్స్ తో పాటు అభిమానులు కూడా భావించారు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అయితే ప్రస్తుతం సరైన హిట్టు సినిమా కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు రామ్ పోతినేని. ఈ ఇప్పుడు తనకు అవకాశాలు వస్తున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. కాగా రామ్ పోతినేని పి. మహేష్ తో ఆంధ్ర కింగ్ తాలూకా మూవీని చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన షూటింగు కూడా పూర్తికానున్నట్లు సమాచారం.

ఇటీవల రిలీస్ చేసిన గ్లింప్స్ కి కూడా ప్రేక్షకుల నుంచి భారీగా రెస్పాన్స్ వచ్చింది. అలాగే మూవీపై కూడా పాజిటివ్ బుజ్ క్రియేట్ అయింది. ఈ సినిమా సంగతి పక్కన పెడితే ఈ సినిమా తర్వాత రామ్ ఎవరి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు అన్న విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. నెక్స్ట్ సినిమాను కూడా ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు. కానీ తాజాగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ప్రస్తుతం కొందరు యంగ్ డైరెక్టర్స్ రామ్ తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఏకంగా ఆరుగురు యంగ్ డైరెక్టర్స్ రామ్ కోసం స్క్రిప్ట్ లపై వర్క్ చేస్తున్నారట. మరికొద్ది రోజుల్లో తాము రాసుకున్న కథపై రామ్ తో డిస్కస్ చేయనున్నారని టాక్. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెవ్వర్ బిఫోర్ అనేలా.. రామ్ కు ఇప్పుడు ఆఫర్స్ వస్తున్నట్లు క్లియర్ గా తెలుస్తోంది. డిమాండ్ ఫుల్ గా ఉందని అర్థమవుతోంది. దాంతో ఇప్పుడు రామ్ ఎవరికీ గ్రీన్ సిగ్నల్ ఇస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.