Ram Gopal Varma : కొడాలి నానిపై వర్మ పెద్ద ఎత్తున ఊహించని సెటైర్లు.. ఏం జరుగుద్దో మరి.!

Ram Gopal Varma : టాలీవుడ్ లో ఏ దర్శకునికి లేని విధంగా వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కి గట్స్ అనాలో లేక తెలియలేనిదనం అనాలో కానీ ఏదైనా సరే వర్మ అనాలి అనుకున్నది చేస్తాడు చెయ్యాలి అనుకున్నది చేసి తీరుతాడు. అలాగే ఒక్కో సారి తన తీరు కూడా కన్ఫ్యుజింగ్ గానే ఉంటుంది. ఒకానొక స్టేజి లో ఒకరికి వత్తాసు పలుకుతున్నాడు అనుకుంటే చివరికి వాళ్లనే ముంచే ప్లాన్ గీస్తాడు.

అలా రీసెంట్ గా ఏపీ పొలిటికల్ వ్యవస్థలో వేలు పెట్టి పలు సినిమాలు తీయడం కొన్ని సంచలన సంఘటనలపై స్పందించడం వంటివి చేసాడు. ఇక దీనితో పాటుగా ఇప్పుడు మరింత స్పీడ్ పెంచాడు. గత కొన్ని రోజుల కితమే తనకి నాచురల్ స్టార్ నాని తప్ప ఇంకెవరూ తెలీదని చెప్పిన వర్మ ఇప్పుడు ఏకంగా ఏపీ మంత్రి కొడాలి నానీని డైరెక్ట్ గా టార్గెట్ చెయ్యడం స్టార్ట్ చేసి ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు.

అలాగే రీసెంట్ గా ఏపీలో కాస్త హాట్ టాపిక్ గా నిలిచిన పేకాట క్లబ్స్ సంక్రాంతి స్పెషల్ గా కనిపించిన వాటిపై ఏవో పోస్టులు కూడా వచ్చాయి. గుడివాడలో గోవా ని తలపించే హంగులు కనిపించాయి అని. ఇప్పుడు దీనిపైనే వర్మ నేరుగా కొడాలి నాని ని టాగ్ చేసి అతన్ని అభినందిస్తున్నట్టుగా గుడివాడని పలు దేశాలకు ధీటుగా తీర్చిదిద్దుతున్నందుకు థాంక్స్ చెబుతున్నానని..

ఇంకా గుడివాడని గోవాగా మాచేసిన కొడాలి నాని అంటూ ఎవరైతే ఈ విషయంలో కామెంట్స్ చేస్తున్నారో వాళ్ళు ఒకటి తెలుసుకోవాలి, గుడివాడ జనం అయితే గోవాకి వెళ్ళగలరు గాని గోవా ప్రజలు గుడివాడ రాలేరు కదా? అని ఓ రేంజ్ లో సెటైరికల్ ట్వీట్స్ వేస్తూ వర్మ మళ్ళీ రచ్చ లేపాడు. అసలే కొడాలి నాని కోసం అందరికీ తెలిసిందే. అనవసరంగా ఇలాంటి వ్యంగ్యాస్త్రాలు అవసరమా వర్మా అంటూ నెటిజన్స్ సోషల్ మీడియాలో వర్మకి జాగ్రత్తలు చెబుతున్నారు.