Ram Gopal Varma : బిగ్ న్యూస్ : పేర్ని నానికి వర్మ సంచలన ప్రశ్నలు.. లాస్ట్ ప్రశ్న అయితే హైలైట్.!

Ram Gopal Varma : ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో ఇంకో సమస్య లేదు అన్నట్టుగా పరిస్థితి ఉంది ప్రధానంగా ఏపీ ప్రభుత్వానికి మరియు టాలీవుడ్ కి మధ్య రసవత్తరంగా టికెట్ ధరల అంశం ఎటెటో తీసుకెళ్తుంది. మరి ఈ అంశంపై ఇన్ని రోజుల్లో చాలా మంది కాదు కానీ కొంతమంది హీరోలు మాత్రమే స్పందించి ఏదైతే అది అయ్యిందని నిలబడ్డారు. ఇక ఇదిలా ఉండగా ఇంకా కూడా ఈ సమస్యకి పరిష్కారం దొరకలేదు.

ఏపీ ప్రభుత్వం కూడా ఎక్కడా తగ్గేలా కనిపించడం లేదు. దీనితో సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ఏపీ సినిమాటోగ్రఫీ ముఖ్యమంత్రి పేర్ని నానికి వర్మ తన సోషల్ మీడియా ద్వారా అనేక ప్రశ్నలు సంధించాడు. టికెట్ రేట్లు ఎందుకు మ్యానేజ్ చెయ్యాలి అనుకుంటున్నారు? పేద వాడి కోసమే తగ్గించాలి అనుకుంటే రేషన్ లో ఇచ్చే బియ్యం, పంచదార, కిరోషన్ లాంటివి పేదలకోసం ఇచ్చినట్టే “రేషన్ థియేటర్స్” అదే పేదల కోసం ప్రభుత్వం తరపున కట్టించవచ్చు కదా? అని ప్రశ్నించాడు.

అలాగే ఇక్కడ రెండు రకాల టికెట్ ధరలను పెట్టుకోండి నిర్మాతలు తమ సినిమాలకు ఒక ధర పెట్టుకుంటారు. మీరు మీ ప్రభుత్వం వాటిని కొనుగోలు చేసుకొని మీ పేదలకు మీకు నచ్చిన తక్కువ ధరల రేట్లకే అమ్ముకొని మీ ఓట్లు మీరు తెచ్చుకోండి అని తెలిపాడు.

ఇక అలాగే ఫైనల్ గా పవన్, అల్లు అర్జున్ మహేష్ బాబు లాంటి హీరోల సినిమాలు విషయంలో మీ టీం హీరోల బట్టి కాకుండా సినిమాకి అయ్యే ప్రొడక్షన్ బట్టి ధరలు రెడీ చేసుకోవాలని తెలిపాడు. దీని తర్వాత అసలు పోస్ట్ పెట్టాడు వర్మ “ఇది నా రిక్వెస్ట్ కాదు నా డిమాండ్ ఇది. మీ కొత్త ధరల వల్ల ఇండస్ట్రీలో అనేకమంది నాకు తెలిసినవారు చెప్పుకొని బాధ పడుతున్నారు. ఇక ఇప్పుడు కూడా అంతా నోర్లు మూసుకొని ఉంటే ఇక ఎప్పటికీ తెరవలేరు. మీ ఖర్మ అంతే” అని ముగించేశాడు.