Ram Gopal Varma:RIP కి సరికొత్త అర్థం చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

Ram Gopal Varma: టాలీవుడ్ ఇండస్ట్రీలో రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ప్రతి నిత్యం ఏదో ఒక విధంగా అందరిని కించపరిచేలా మాట్లాడి తరచూ వివాదాలలో నిలుస్తూ ఉంటాడు. రామ్ గోపాల్ వర్మ ఎవరినైనా ఎప్పుడు కించపరిచేలా మాట్లాడటమే కాకుండా అప్పుడప్పుడు ఆయన కొందరిని పొగడటం అందరికీ నమ్మలేని విధంగా ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడు వివాదాలలో నిలిచి వివాదాస్పద దర్శకుడు గా పేరు తెచ్చుకున్నాడు. ఐతే ఇటీవల రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఒకటి బాగా వైరల్ అయ్యింది.

తాజాగా రామ్ గోపాల్ వర్మ చావు పై స్పందిస్తూ సోషల్ మీడియా ద్వారా వరుస ట్వీట్లు చేశాడు. ఈ సందర్భంగా RIP అనే పదానికి కొత్త అర్థాన్ని చెప్పాడు. ఈ సందర్భంగా జీవించి ఉన్న వ్యక్తులపై జోక్ చేశాడు జీవించి ఉన్న వారికంటే మరణించిన వారి జీవితం బాగుంటుందని,మరణించిన వారికి స్వర్గంలో అమృతం వంటి మంచి పానీయ లభిస్తుంది అన్నారు. మరణించిన వారికి ఇంద్రభవణం వంటి మంచి ఇల్లు , రంభ,ఊర్వశి, మేనక ల వంటి మంచి మహిళలు ఉంటారు. పాపం చేసిన వాళ్ళే చనిపోవటనికి భయపడతారు, ఎందుకంటే పాపం చేసిన వారు నరకానికి వెళ్తారు గనుక.

“చనిపోయిన వ్యక్తులకు RIP అని చెప్పటం చాలా అవమానకరమైనది గా ఉంటుందని ఆయన భావం వ్యక్తం చేశాడు. భూలోకంలో ఏ పని లేకుండా విశ్రాంతి తీసుకునే వారిని సోమరిపోతులు అంటారు. కాబట్టి మరణించిన తర్వాత ఒక వ్యక్తికి RIP అని చెప్పటం కన్నా సంతోషకరమైన జీవితాన్ని గడపండి” అంటూ చెప్పాలి. ఈ సందర్భంగా లతా మంగేష్కర్ రాయల్ ఆల్బర్ట్ హాల్, లండన్, ఫస్ట్ కాన్సర్ట్, 1974 గురించి మాట్లాడిన గొప్ప మాటలు’అంటూ సోషల్ మీడియా ద్వారా ఒక వీడియో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ బాగా వైరల్ గా మారింది.