RGV: అమ్మాయిలతో పబ్ లో రచ్చ చేస్తున్న వర్మ.. ఫోటోలు వైరల్!

RGV: ఏదో ఒక వార్తతో అందరి నోట్లో పడటం వర్మకు మహా సరదా.ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీ టాపిక్ తో మీడియాను తన చుట్టూ తిప్పుకోవడం కామనే. కొండా సినిమా ప్రమోషన్స్ తో పొలిటికల్ హీట్ పెంచిన వర్మ సాయంత్రానికి పబ్ లో చుట్టూ అమ్మాయిలతో ఛిల్ల్ అవుతూ దర్శనమిచ్చాడు. మద్యం సేవిస్తూ అమ్మాయిలతో డాన్సులు చేస్తున్న వీడియోను నెట్టింట్లో షేర్ చేసి అందరికి షాకిచ్చాడు.

వీడియోలో ఏకంగా ఒక ముద్దుగుమ్మతో ముద్దుకు ఫోజ్ ఇస్తూ చేతిలో మద్యం సీసా పట్టుకుని దర్శనమిచ్చాడు. చుట్టూ అమ్మాయిలతో కలిసి మద్యం తాగుతూ సిగరెట్ కాలుస్తూ చిందులు వేసిన వర్మకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ క్రమంలోని ఈ వీడియో తో పాటు మరొక ఫోటో ని కూడా సోషల్ మీడియాలో షేర్ ఒక చేతితో మందు గ్లాసు మరొక చేతితో అమ్మాయిని గట్టిగా పట్టుకుని ఉన్నఒక చేతితో మందు గ్లాసు మరొక చేతితో అమ్మాయిని గట్టిగా పట్టుకుని ఉన్న ఫోటోని షేర్ చేశారు.

 

ఇక ఈ ఫోటోని షేర్ చేస్తూ ఈ ఫోటోకి సరైన కాప్షన్ ఇస్తే లక్ష ఇస్తానంటూ ఆఫర్ ఇచ్చాడు దీంతో ట్రోలర్స్ కి పండగ అయింది. కొండా ప్రమోషన్స్ కోసంలో భాగంగానే ఈ కాంట్రవర్సీ వీడియోతో హల్‌చల్ చేస్తున్నాడని మరికొందరు విమర్శిస్తూ వుంటే జీవించడం కళ అది వర్మ కు మాత్రమే తెలుసు అంటూ మరి కొంతమంది నెటిజెన్స్ వర్మపై సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి వర్మ వీడియో ద్వారా సోషల్ మీడియాలో మరోసారి రచ్చ చేస్తున్నారు.