పొద్దున్నే ప్రభాస్ “రాధే శ్యామ్” ని టార్గెట్ చేసిన వర్మ.!

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదొక కాంట్రవర్సీ తో రామ్ గోపాల్ వర్మ వస్తూనే ఉంటాడు. అలాగే ఒకోసారి ఏదో హీరోని పొగుడుతూనే మంచి సెటైర్స్ కూడా వేస్తూ ఉంటాడు. ఇప్పుడు సినిమాలు కూడా పెద్దగా ఏవి చెయ్యకపోతుండడంతో సోషల్ మీడియాలో మరింత యాక్టీవ్ గా ఉంటున్న వర్మ లేటెస్ట్ గా ఈ పొద్దున్నే పాన్ ఇండియన్ సూపర్ హీరో ప్రభాస్ పై సెటైర్స్ తో స్టార్ట్ చెయ్యడం ఫ్యాన్స్ కి చికాకుగా మారింది.

మరి నిన్న ప్రభాస్ బర్త్ డే కి ఓ రేంజ్ లో ఎత్తేసి ఈరోజు పొద్దున్నే ఫ్రెష్ గా తన భారీ డిజాస్టర్ రాధే శ్యామ్ తో దండకం అందుకున్నాడు వర్మ. మరి ఇంతకీ తాను ఏమంటున్నాడు అంటే.. హే ప్రభాస్ మళ్ళీ దేవుడు దయతో ఈ దీపావళి సందర్భంగా నీ రాధే శ్యామ్ సినిమాని మళ్ళీ రీ రిలీజ్ చెయ్యి ఈసారి అది బాహుబలి కన్నా పెద్ద హిట్ అవుతుంది అంటూ సెటైర్ వేసాడు.

దీనితో పొద్దున్నే మాకేంటి ఇది అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ చిరాకు పడుతున్నారు. ఇప్పుడుకే రాధే శ్యామ్ పోయిన బాధ నుంచి తేరుకుంటున్నారు నిన్న గట్టి సంబరాలు జరుపుకున్నారు ఫ్యాన్స్ మళ్ళీ పొద్దునే అదే సినిమాని గుర్తు చేస్తూ వర్మ ఆనందం పొందుతున్నాడు.