తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీలో ఈ రెండు రోజులు నుంచి వినిపిస్తున్న లేటెస్ట్ అంశం రామ్ గోపాల్ వర్మ అలాగే ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మీటింగ్. అయితే ఈ మీటింగ్ సారాంశం ఓ సినిమా కోసం అని ఆ సినిమా పవన్ మీదనే అని పలు రూమర్స్ అయితే బయటకి వచ్చాయి.
మరి ఇప్పుడు లేటెస్ట్ గా అయితే రామ్ గోపాల్ వర్మ ఈ అనుమానాలకు మరింత ఆద్యం పోస్తూ బిగ్ అప్డేట్ ని అందించాడు. తాను కొత్తగా తీసే సినిమా అందులో నిజా నిజాలు ఎంత అనేవి అంటూ షాకింగ్ పోస్ట్ పెట్టాడు.
“నేను అతి త్వరలో “వ్యూహం” అనే రాజకీయ సినిమా తియ్యబోతున్నాను ..ఇది బయోపిక్ కాదు …బయో పిక్ కన్నా లోతైన రియల్ పిక్. బయో పిక్ లో అయినా అబద్దాలు ఉండొచ్చు కానీ ,రియల్ పిక్ లో నూటికి నూరు పాళ్ళు నిజాలే ఉంటాయి.” అంటూ తెలిపాడు.
ఈ మేటర్ చదివితే మినిమమ్ తెలుగు రాష్ట్రాల సినిమా అలాగే రాజకీయాలపై అవగాహన ఉన్న ఉన్నవారికి పవన్ ని టార్గెట్ చేసి తీసేదే అని అర్ధం అవుతుంది. పవన్ తన పొలిటికల్ కెరీర్ లో చాలా సార్లు ఈ “వ్యూహం” అనే మాట చెప్పేవాడు. మరి దానినే ఇప్పుడు వర్మ జగన్ తో మీటింగ్ తర్వాత అనౌన్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. మరి ఈ సినిమా పవన్ పైనేనా కాదా అనేది తెలియాలి అంటే ఆగి చూడాలి.
నేను అతి త్వరలో “వ్యూహం” అనే రాజకీయ సినిమా తియ్యబోతున్నాను ..ఇది బయోపిక్ కాదు …బయో పిక్ కన్నా లోతైన రియల్ పిక్.
బయో పిక్ లో అయినా అబద్దాలు ఉండొచ్చు కానీ ,రియల్ పిక్ లో నూటికి నూరు పాళ్ళు నిజాలే ఉంటాయి.— Ram Gopal Varma (@RGVzoomin) October 27, 2022