ఇప్పుడు తెలుగు సినిమా మార్కెట్ కానీ మన టాలీవుడ్ హీరోల క్రేజ్ కానీ పాన్ ఇండియన్ లెవెల్లో ఎంత మొత్తంలో చేరుకుంటుందో చూస్తూనే ఉన్నాము. మరి ఈ లిస్ట్ లో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ముందు లైన్ లో ఉంటాడు ఇందులో నో డౌట్.. అంతే కాకుండా తన రెమ్యునరేషన్ కోసం వింటే కూడా ప్రతీ ఒక్కరికీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. సింపుల్ గా 100 కోట్లు ఒక సినిమాని ప్రభాస్ ఇప్పుడు ఛార్జ్ చేస్తున్నాడు.
అయితే దీనికి ఒక్క 10 కోట్ల తేడాతో ప్రభాస్ తర్వాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నిలబడ్డాడని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు సెన్సేషనల్ దర్శకుడు శంకర్ తో చేస్తున్న సినిమాకి గాను ఏకంగా చరణ్ 90 కోట్లు తీసుకుంటున్నాడట.. జస్ట్ ఇది గాసిప్ మాత్రమే ఒకవేళ నిజం అయితే కానీ ప్రభాస్ తర్వాత మళ్ళీ అంత మొత్తంలో అందుకునేది చరణ్ అనే చెప్పాలి మరి.