Ram Charan: బాలీవుడ్ లో సందడి చేయనున్న రామ్ చరణ్ రంగస్థలం.. విడుదల ఎప్పుడంటే?

Ram Charan: దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంచి పేరు సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత ప్రతి ఒక్కరు తెలుగు సినిమాలపై ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం తెలుగులో తెరకెక్కే సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కి ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా పాన్ స్థాయిలో విడుదల అయ్యి మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది.

ఈ క్రమంలోనే అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురం సినిమా హిందీలో డబ్ చేసి విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాని జనవరి 26వ తేదీ బాలీవుడ్ ఇండస్ట్రీలో విడుదలకు సిద్ధమైంది.ఇదిలా ఉండగా తాజాగా మరో సినిమా కూడా బాలీవుడ్ ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది.సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ సమంత జంటగా నటించిన రంగస్థలం సినిమా తెలుగులో ఎంత మంచి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈ సినిమాని కూడా హిందీలో డబ్ చేసి విడుదల చేస్తే మంచి కలెక్షన్లను రాబడుతోందని నిర్మాత
మనీష్ షాహా తెలిపారు. అందుకే ఈ నెల 26వ తేదీ హిందీలో అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురం విడుదల కాగా వచ్చేనెల ఫిబ్రవరిలో రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా విడుదల చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం హిందీ ప్రజలు తెలుగు సినిమాలను మంచిగా ఆదరిస్తున్నారని ఈ క్రమంలోనే ఈ సినిమాలను హిందీలో డబ్ చేయనున్నట్లు తెలిపారు.కేవలం తెలుగు చిత్రాలు మాత్రమే కాకుండా తమిళంలో హీరో అజిత్ విజయ్ నటించిన చిత్రాలు కూడా తమిళంలో డబ్ కానున్నట్లు తెలిపారు.