Ram Charan: సినిమాల విషయంలో ఎన్ని జన్మలెత్తినా ఆ పని మాత్రం చేయను… షాకింగ్ డేసిషన్ తీసుకున్న చరణ్?

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ తన తండ్రి పేరును ఏ మాత్రం ఉపయోగించుకోకుండా తన సొంత టాలెంట్ తో ఇండస్ట్రీలో అంచలంచలుగా ఎదిగి గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఇక పాన్ ఇండియా స్థాయిలో చరణ్ ఎంతో మంచి క్రేజ్ ఏర్పరచుకున్నారు.

ఇక ప్రస్తుతం రామ్ చరణ్ నటించిన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్లో ఓ పాన్ ఇండియా సినిమాకు కమిట్ అయ్యి షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఈయన బుచ్చిబాబు డైరెక్షన్లో మరో పాన్ ఇండియా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇలా చరణ్ వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పట్ల బిజీ అయ్యారు.

ఇలా వరుస సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న చరణ్ తాజాగా సినిమాలకు సంబంధించి చేస్తున్న వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సాధారణంగా ప్రతి ఒక్క హీరో కూడా సినిమాలలో ఇంత వరకే నటించాలి అంటూ కొన్ని లిమిట్స్ పెట్టుకొని ఉంటారు. పరిస్థితులు ఎలాంటివైనా ఆ లిమిట్స్ క్రాస్ చేయకుండా సినిమాలలో నటిస్తూ ఉంటారు. ఇక చరణ్ కూడా అలాంటి లిమిట్స్ పెట్టుకున్నారని తెలుస్తోంది.

సినిమాల పరంగా హీరోయిన్లతో కలిసి రొమాంటిక్ సన్నివేశాలలో నటించకూడదు అనే నిర్ణయాన్ని ఈయన తీసుకున్నారట. ఈయన చివరిగా రంగస్థలం సినిమాలో సమంతతో కలిసి లిప్ లాక్ సన్నివేశాలలో నటించారు అయితే ఈ సీన్ లో చరణ్ నటించిన ఉపాసనకు కాస్త ఇబ్బందిగా మారడంతోనే చరణ్ ఇలాంటి డెసిషన్ తీసుకున్నారని తెలుస్తోంది. వ్యక్తిగత జీవితం వరకు చరణ్ ఇలా ఉండటం కరెక్టే కానీ సినిమాల విషయంలో ఇలా లిమిట్స్ పెట్టుకుంటే కష్టమేనని కొంతమంది భావిస్తున్నారు. ఏది ఏమైనా చరణ్ డెసిషన్ అందరికీ షాకింగ్ గానే ఉందని చెప్పాలి.