Rakul Preet Singh : టాలీవుడ్ సినిమాకి పరిచయం అయ్యి అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ తెచ్చుకున్న హీరోయిన్స్ తక్కువ మందే ఉంటారు. అలా వచ్చి తక్కువ కాలంలోనే బడా స్టార్ నటుల సరసన ఛాన్స్ లు కొట్టేసి అదరగొట్టిన గ్లామరస్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఒక ఐదారేళ్ళ వెనక అందరి స్టార్ హీరోలతో నటించేసిన మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ హీరోయిన్ తర్వాత టాలీవుడ్ లో నెమ్మదిగా ఫేడ్ అవుట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది.
తర్వాత ఏవో సినిమాలు చేసినా అవి కూడా పెద్దగా ఆడలేదు. దీనితో మళ్ళీ హిందీ సినిమాలోకి వెళ్లిన ఈ యంగ్ హీరోయిన్ ఇప్పుడు అక్కడే బిజీగా ఉంది. అయితే ఈమె తన బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానీ తో డేటింగ్ లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు ఈ ఇద్దరు కూడా అతి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని పలు పుకార్లు వైరల్ అవుతున్నాయి.
మరి వీటిపై ఆమె స్పందించినట్టు తెలుస్తుంది. ఈ పుకార్లకు గాను ఆమె ఊహించని రిప్లై నే ఇచ్చింది అని చెప్పాలి. కొంతమంది మనుషులు నిజం ఏమిటి అనేది బయటకి వచ్చేవరకు ఆగలేకపోతున్నారని అనుకుంటున్నాను. ప్రస్తుతానికి అయితే నా ఫోకస్ మొత్తం అంతా నా పది సినిమాలు పైన మాత్రమే ఉంది. అవన్నీ అయ్యాకే ఏది జరగాలని ఉంటే అదే జరుగుతుంది” అని కామెంట్స్ చేసింది. దీనితో రకుల్ పై వైరల్ అవుతున్న గాసిప్స్ కి సమాధానం దొరికినట్టేగా.