Rakul Preet Singh : కొత్త బిజినెస్‌లోకి అడుగు పెట్టబోతున్నరకుల్.!

Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ కేవలం హీరోయిన్ మాత్రమే కాదు, చిన్నపాటి బిజినెస్ విమెన్ కూడా. కెరీర్ పరంగా సినిమాల్లో నటిస్తున్నా, ఇక్కడ సంపాదించిన సొమ్మును బిజినెస్‌లో పెట్టుబడులు పెడుతూ బోలెడంత లాభాలు ఆర్జిస్తుంటుంది.
ఇప్పటికే రకుల్‌కి బోలెడన్ని ఫిట్‌నెస్ స్టూడియోలున్నాయ్. ఇండియా మొత్తం ఈ బిజినెస్ ఛైన్ రన్ అవుతోంది ప్రస్తుతం. అయితే, తాజాగా రకుల్ బిజినెస్ ప్లానింగ్స్ ఇంకాస్త ఎత్తుకు ఎదగబోతున్నాయ్. ఆమె తన బిజినెస్ ఛైన్‌ని దుబాయ్‌లోని ప్రముఖ నగరాలకు విస్తరింపచేయాలనుకుంటోందట.
ఆ క్రమంలో ఇప్పటికే గ్రౌండ్ వర్క్ పూర్తి చేసేసిందట. ఇండియా నుండి, యుఏఈ వరకూ ఒక ఛైన్ మార్కెట్‌లా తన బిజినెస్‌ని విస్తరింపచేయాలనుకుంటోందట రకుల్ ప్రీత్ సింగ్. దీంతో పాటు మరో రెండు, మూడు కొత్త బిజినెస్‌లు ప్లాన్ చేసేందుకూ రకుల్ సిద్ధమవుతోందట.  పోలా అదిరిపోలా.  రకుల్ ప్రీత్ సింగా.! మజాకానా.!
ఇక, రకుల్ హీరోయిన్‌గా ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో బిజీగా వుంది. చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు కాకపోయినా కెరీర్ పరంగా రకుల్ బిజీగానే గడుపుతోంది. ఇటీవలే మెగా హీరో వైష్ణవ్ తేజ్‌తో ‘కొండపొలం’ సినిమాలో కనిపించింది.నటిగా తనకున్న అనుభవాన్నంతా ఈ సినిమాలో చూపించింది రకుల్. ఓబులమ్మగా ఆ పాత్రలో ఒదిగిపోయింది. మంచి పేరు దక్కించుకుంది.