ఇప్పుడప్పుడే ఆ మూడ్ లేదంటున్న రకుల్ ప్రీత్.!

టాలీవుడ్ లో అడుగు పెట్టి తక్కువ సినిమాలతోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశం కొట్టేసిన తక్కువ మంది హీరోయిన్స్ లో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఒకరు. అయితే రకుల్ తనకి ఆనతి కాలం లోనే వచ్చిన స్టార్డం ని తెలుగు మార్కెట్ లో నిలబెట్టుకోలేక ఇప్పుడు తెలుగు ప్రాజెక్ట్స్ బాగా తగ్గించేసుకుని హిందీలో మళ్ళీ సినిమాలు చేస్తుంది.

అయితే రకుల్ ప్రీత్ సింగ్ గత అక్టోబర్ లోనే తన బాలీవుడ్ కి చెందిన నిర్మాత మరియు నటుడు జాకీ భాగ్నాని తో రేలషన్ లో ఉన్నానని ప్రకటించడంతో రకుల్ వైవాహిక జీవితంపై ఓ క్లారిటీ వచ్చింది. ఇక ఇక్కడ నుంచే వీరు అప్పుడే పెళ్లి చేసేసుకుంటున్నారని వచ్చే ఏడాది వేసవిలో ఫిక్స్ అయ్యిపోయింది అని పలు గాసిప్స్ చక్కర్లు కొడుతుండగా..

వాటిపై రకుల్ లేటెస్ట్ ఓ ఇంటర్వ్యూ లో నోరు విప్పింది. తనకి ఇప్పుడప్పుడే ఎలాంటి పెళ్లి ఇతర అంశాలపై ఎలాంటి మూడ్ లేదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అన్ని భాషల్లో కలిపి కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి అవన్నీ అయ్యాక ఫ్యూచర్ లో ఎప్పుడు తమ పెళ్లి ఉంటుందో అనేది కూడా చెప్పలేను అన్నట్టు ఆన్సర్ ఇచ్చింది.