తన రిలేషన్షిప్ గురించి బయటపెట్టిన రకుల్ ప్రీత్..

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన రకుల్ ప్రీత్ టాలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకోగా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ బాలీవుడ్ లో సెటిల్ అయింది. అక్కడే వరుస ఆఫర్లతో బాగా బిజీగా మారింది. ఇక ఈమె వ్యక్తిగత విషయంలో చూసినట్లయితే.. జాకీ భగ్నాని అనే వ్యక్తితో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.

ఈ విషయం గురించి తాజాగా కొన్ని విషయాలు బయట పెట్టింది. అతడు తనకు మంచి స్నేహితుడని.. తమ అభిరుచులు కలవడంతో ప్రేమలో పడ్డామని తెలిపింది. ఇక తమ రిలేషన్ మొదలైనప్పుడే తమ బంధం గురించి బయట పెట్టాలనుకుందట. లేదంటే అసత్య ప్రచారాలు జరుగుతాయని తెలిపింది. అందరు తమ పని గురించి మాట్లాడుకోవాలి కానీ తమ పర్సనల్ లైఫ్ గురించి కాదని అన్నది. సెలబ్రెటీల జీవితంపై అందరి దృష్టి సారిస్తానని.. అందుకే తమ రిలేషన్ షిప్ గురించి బయటకు తెలిపామని అన్నది.