తన ఫేవరెట్ సాంగ్ కి అదిరిపోయే స్టెప్పులేసిన రకుల్.. వీడియో వైరల్…!

తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషలలో స్టార్ హీరోల సరసన నటించి అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ అమ్మడు ప్రస్తుతం అగ్ర కథానాయికగా వెలుగొందుతోంది. అయితే తెలుగులో ఈ అమ్మడు జోరు కొంచం తగ్గినట్టు కనిపిస్తోంది. హింది లో వరుస అవకాశాలు రావటంతో ఈ అమ్మడు ఈ మధ్య కాలంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఆక్టివ్ గా ఉంటుంది.

సోషల్ మీడియాలో ఈ అమ్మడు షేర్ చేసే ఫోటోలు, వీడియోలు నెటిజన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి. షేర్ చేసిన కొంత సమయంలోనే వైరల్ గా మారుతున్నాయి. ఇటీవల ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ అమ్మడు షేర్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోలో రకుల్ ప్రీత్ బ్లాక్ డ్రెస్ లోతనకి ఇష్టమైన పసూరి పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసింది. రకుల్ ప్రీత్ సింగ్ కొంతకాలంగా సెలబ్రెటీ డాన్స్ కొరియోగ్రాఫర్ డింపుల్ వద్ద డాన్స్ లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటుంది. ఈ సందర్భంగా పసూరి పాటకి డాన్స్ చేసి ఆ వీడియోని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ వీడియో షేర్ చేస్తూ.. ప్రజెంట్ మై ఫేవరెట్ సాంగ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

రకుల్ ప్రీత్ సేవ్ చేసిన ఈ డాన్స్ వీడియో అతి తక్కువ సమయంలోనే అత్యధిక వ్యూస్ సాధించి వైరల్ గా మారింది.వీడియో షేర్ చేసిన ఒక గంట సమయంలోనే 3 లక్షల వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో పై రకుల్ ప్రీత్ సింగ్ బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానీ కూడా కామెంట్ చేశాడు. “మై డియర్ లవ్ నాక్కూడా డాన్స్ నేర్పించవా” అంటూ జాకీ భగ్నానీ కామెంట్ చేశారు. వీరిద్దరు కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం గురించి రకుల్ స్వయంగా రివీల్ చేసింది.