సుమ గురించి విస్తుపోయే నిజాలు బయటపెట్టిన రాజీవ్ కనకాల..!

రాజీవ్ కనకాల తెలుగు ఇండస్ట్రీలో ఈ పేరు గురించి పరిచయం అక్కర్లేదు. రాజీవ్ కనకాల ప్రముఖ యాంకర్ సుమ కనకాల భర్త. అంతేకాకుండా ఈయన ఎన్నో సినిమాలలో, సీరియల్స్ లో నటించి నటుడిగా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. రాజీవ్ కనకాల మొదట బుల్లితెర మీద సీరియల్స్ లో నటించాడు. బాయ్ ఫ్రెండ్ సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రాజీవ్ కనకాల రాజమౌళి దర్శకత్వం వహించిన స్టూడెంట్ నెంబర్ 1 సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఎప్పటినుండి రాజీవ్ కనకాల ఎన్నో సినిమాలలో ప్రధాన పాత్రలో నటిస్తూ నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందాడు.

రాజీవ్ కనకాల, ప్రముఖ టాలీవుడ్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరు స్టూడెంట్ నెంబర్ 1 సినిమ సమయం నుండి మంచి స్నేహితులు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ప్రతి సినిమాలోనూ రాజీవ్ కనకాల కోసం ఒక పాత్ర ఉంటుంది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో కూడా రాజీవ్ కనకాల ఒక పాత్రలో నటించాడు. ఇదిలా ఉండగా కొంతకాలం క్రితం రాజీవ్, సుమ మద్య గొడవలు జరిగి విడాకులు తీసుకొనున్నట్టు వార్తలు వినిపించాయి. కానీ ఆ వార్తల గురించి సుమ, రాజీవ్ ఇద్దరు కొట్టిపారేశారు.

తాజాగా రాజీవ్ కనకాల తన భార్య సుమ గురించి కొన్ని నిజాలు బయటపెట్టారు. ఈ క్రమంలో వారి మధ్య జరిగిన గొడవల గురించి కూడా రాజీవ్ చెప్పుకొచ్చాడు. కుటుంబం అన్న తర్వత భార్య, భర్తల మధ్య గొడవలు రావటం సహజం. అది అందరి జీవితంలోనూ జరుగుతుంది. మా మద్య కూడా అప్పుడప్పుడు గొడవలు జరగటం నిజం. నాకు కోపం వస్తే కొంతసేపటికి మామూలు అయ్యి మాట్లాడుతాను. కానీ సుమ అలా కాదు..తనకి కోపం వస్తే రెండూ, మూడూ రోజులు మాట్లాడదు. తన కోపం తగ్గిన తర్వాత మళ్లీ మాట్లాడుతుంది.. అంటూ సుమ కోపం గురించి తాజాగా జరిగిన ఇంటర్వ్యు లో రాజీవ్ చెప్పుకొచ్చాడు.