జబర్దస్త్ స్టేజ్ పై సందడి చేసిన రాజీవ్ కనకాల..రచ్చ మామూలుగా లేదుగా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజీవ్ కనకాల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రముఖ యాంకర్ సుమ కనకాల భర్తగా మాత్రమే కాకుండా నటుడిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాలో కీలక పాత్రలో నటించిన రాజీవ్ అప్పటి నుండి జూనియర్ ఎన్టీఆర్ కి మంచి ఫ్రెండ్ అయ్యాడు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ప్రతి సినిమాలోనూ రాజీవ్ కనకాల కోసం ఖచ్చితంగా ఒక పాత్ర ఉంటుంది. ఇలా ఎన్నో సినిమాలలో నటించిన రాజీవ్ కనకాల ఇటీవల రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ లో ఒక సీన్ లో కనిపించారు.

అయితే రాజీవ్ కనకాల వెండి తెర మీద మాత్రమే కాకుండా బుల్లితెర మీద కూడా చాలా అనుభవం ఉన్న వ్యక్తి. రాజీవ్ కనకాలకి ఎన్నో సీరియల్ లో నటించిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఈయన బుల్లితెర మీద ఎక్కువగా కనిపించడం లేదు. అటు వెండి తెరమీద కూడా అడపాదడపా సినిమాల్లో నటిస్తూ అప్పుడప్పుడు కనిపిస్తున్నాడు. తాజాగా రాజీవ్ కనకాల జబర్దస్త్ లో సందడి చేశాడు. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో లో జడ్జిగా వ్యవహరిస్తున్న రోజా, సింగర్ మనో షోలో కనిపించటం లేదు. అయితే రోజా గారి స్థానంలో ఇంద్రజ గారు జడ్జిగా వచ్చారు. మనో స్థానం మాత్రం అలాగే ఖాళీగా ఉండిపోయింది .

ప్రతి వారం ఎవరో ఒకరు గెస్ట్ ని తీసుకొచ్చి జడ్జీలుగా పెడుతున్నారు. అయితే తాజాగా ఈ జబర్దస్త్ కామెడీ షో లో రాజీవ్ కనకాల జడ్జిగా వ్యవహరించాడు. అంతేకాకుండా ఒక స్కిట్ లో కూడా పర్ఫామ్ చేశాడు . ఆది టీమ్ లో కంటెస్టెంట్ గా ఉన్న అజర్ ఇప్పుడు టీం లీడర్ స్థానంలో ఉన్నాడు. ఈవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో రాజీవ్ కనకాల అజర్ టీమ్ లో స్కిట్ చేశాడు. ఈ స్కిట్ లో భాగంగా అజర్ ఇంత బతకు బతికి ఇంటి వెనకాల చావడం అంటే ఏంటే తెలుసా? అని రాజీవ్ ని అడగ్గా.. ఇదిగో ఇప్పుడు చూస్తున్నా అదే కదా అంటూ రాజీవ్ సెటైర్ వేస్తాడు. ఇక ఈ స్కిట్ లో రీతు కూడా అజర్ మీద సెటైర్ లు వేసింది. ఈ షో లో రాజీవ్ కనకాల పర్మినెంట్ బిజీగా ఉంటారా లేక గెస్ట్ గా వచ్చి వెళ్ళిపోతారా అన్న విషయం గురించి తెలియాల్సి ఉంది.