భార్యకి పోటీగా ఈ టీవిలో సందడి చేయనున్న రాజీవ్ కనకాల..?

నటుడు రాజీవ్ కనకాల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెర ప్రముఖ యాంకర్ సుమ కనకాల భర్తగా మాత్రమే కాకుండా నటుడిగా తనకంటూ మంచి గుర్తింపు పొందాడు. ఇటీవల రాజమౌళి దర్శకత్వం వహించిన త్రిబుల్ ఆర్ సినిమాలో కూడా ఒక పాత్రలో నటించాడు. ఇదిలా ఉండగా రాజీవ్ కనకాల భార్య సుమ గత కొన్ని సంవత్సరాలుగా బుల్లితెరను ఏలుతోంది. ముఖ్యంగా ఈటీవీలో ప్రసారమవుతున్న పలు టీవీ షోలకు గత కొన్ని సంవత్సరాలుగా సుమ యాంకర్ గా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం సుమ ఈటీవీలో ప్రసారమవుతున్న క్యాష్ షో లో యాంకర్ గా సందడి చేస్తోంది. సుమ ఇలా టీవీ షోలు మాత్రమే కాకుండా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లు కూడ చేస్తూ ఇండస్ట్రీలో టాప్ యాంకర్ గా పాపులర్ అయ్యింది.

సుమ భర్త రాజీవ్ కనకాల కూడా స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ద్వారా ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయ్యాడు. అంతేకాకుండా ఈయన పలు సీరియళ్లలో కూడా నటించాడు. ఇటీవల రాజీవ్ కనకాల తక్కువ సినిమాలలో మాత్రమే నటిస్తున్నాడు. రాజీవ్ కనకాల అప్పుడప్పుడు భార్యతో కలసి కొన్ని టీవి షోస్ లో కనిపించాడు . ఈ క్రమంలో మరొకసారి ఈ టీవిలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో లో జడ్జ్ గా సందడి చేసాడు.

ఇదిలా ఉండగా రాజీవ్ జబర్థస్త్ లో జడ్జ్ గా కనిపించటంతో నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇన్ని రోజులు భార్య ఈటీవీ ని ఏలింది. ఇప్పుడు ఆమె సరిపొదన్నట్టు సుమ కు పోటీగా సుమ భర్త కూడా ఈటీవీ ని ఏలాటానికి వచ్చాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. భార్య,భర్తలు ఇద్దరు ఈటీవీ లో పాగా వేయాలని చూస్తున్నారా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే రాజీవ్ కనకాల ఒక్కరోజు గెస్ట్ గా జబర్థస్త్ కి వచ్చడా? లేక జబర్థస్త్ లో పర్మనెంట్ జడ్జ్ గా ఉండటానికి వచ్చాడా అన్న విషయం గురించి ఇంకా తెలియాల్సి ఉంది.