Harsha Vardhan: నటుడు హర్షవర్ధన్ ఇటీవల ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూలో భాగంగా ఈయన రాజీవ్ కనకాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ హర్షవర్ధన్ గురించి ఒక ప్రశ్న వేశారు మీరు అప్పట్లో రెండు మూడు రోజులు పైకి లేకుండా ఆట ఆడేవారట కదా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు హర్షవర్ధన్ సమాధానం చెబుతూ ఈ సీక్రెట్ నాకు రాజీవ్ కనకాలకు తప్ప ఎవరికీ తెలియదు. నా సీక్రెట్ చెప్పాడు కాబట్టి వాడిని ఇరికించే విషయం మీకు ఒకటి చెబుతాను అంటూ అసలు విషయం పెట్టారు.
నాకు రాజీవ్ ఇద్దరికీ సినిమా అవకాశాలు లేని సమయంలో మేము పేకాట ఆడటం మొదలుపెట్టాము అయితే సరదాగా మొదలుపెట్టిన ఆట మాకు ఒక వ్యసనంగా మారిపోయింది ఎంతలా అంటే రాత్రి 8 గంటలకు మొదలుపెడితే తెల్లవారే వరకు ఆడుతూనే ఉండేవారు. ఇలా మేము ఈ ఆటకు బానిసలమైన విషయం తెలిసిన మా స్నేహితులు రే కనీసం తిండైనా తింటున్నారా బాత్రూమ్ అయినా వెళ్తున్నారా అంటూ అడిగేవారు.
మేము 5 పైసలతో ఈ ఆట ఆడటం మొదలుపెట్టి చివరికి అది కోట్లలో అప్పు చేసే వరకు వెళ్లిపోయిందని హర్షవర్ధన్ తెలిపారు. ఈ ఆట ఆడటం కోసం నేను రాజీవ్ కనకాల వద్ద ఏకంగా 350 కోట్ల రూపాయలు అప్పు చేశాను అంటూ హర్షవర్ధన్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. హర్షవర్ధన్ చేసిన ఈ వ్యాఖ్యలతో నెటిజెన్స్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు 350 కోట్లు అప్పుచేసి పేకాట ఆడటం ఏంటి? అయినా పేకాట ఆడటం కోసం రాజీవ్ కనకాల అంతా ఇచ్చారా? ఆయన అంత సంపాదించారా? అంటూ పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే తనని ఇరికించే ప్రయత్నంలో భాగంగానే ఇలా సరదాగా చెప్పి ఉంటారని మరికొందరు భావిస్తున్నారు. ఏది ఏమైనా రాజీవ్ కనకాల గురించి నటుడు హర్షవర్ధన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.