Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పొలిటికల్ తుఫాన్.. సంచలన వ్యాఖ్యలు చేసిన స్టార్ హీరో!

Pawan Kalyan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో కూడా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇలా రాజకీయ నాయకుడిగా బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాలలో కూడా నటిస్తున్నారు అయితే తాజాగా పవన్ కళ్యాణ్ గురించి సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రజనీకాంత్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 50 సంవత్సరాలను పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఎంతోమంది ఈయన సినీ ప్రస్థానాన్ని గుర్తుచేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ సైతం రజనీకాంత్ 50 సంవత్సరాల సినీ కెరియర్ పూర్తి అయిన సందర్భంగా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. వెండి తెరపై సూపర్ స్టార్ రజినీకాంత్ అని టైటిల్ పడగానే థియేటర్లలో ఎలాంటి సందడి వాతావరణం ఉండేదో పలు సందర్భాలలో తాను చెన్నైలో చూసానని పవన్ కళ్యాణ్ తెలిపారు. నటుడిగా ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్న నటుడు రజినీకాంత్ కు హృదయపూర్వక అభినందనలు అంటూ ఒక సుదీర్ఘమైన ప్రకటన విడుదల చేశారు.

ఇలా 50 సంవత్సరాల సినీ కెరియర్ పూర్తి అయిన సందర్భంగా పవన్ కళ్యాణ్ తనకు అభినందనలు తెలియజేస్తూ చేసిన పోస్టుకు రజనీకాంత్ రిప్లై ఇస్తూ.. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, నా ప్రియమైన సోదరుడు, రాజకీయా తుఫాన్ పవన్ కళ్యాణ్ కు నా హృదయపూర్వక ధన్యవాదాలు. దేవుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలను సుఖ సంతోషాలను ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ రజనీకాంత్ రిప్లై ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ను రాజకీయాలలో తుఫాన్ గా పోలుస్తూ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ అభిమానులను జనసైనికులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయి. ప్రస్తుతం ఈ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక రజనీకాంత్ ఇటీవల కూలీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అనుకున్న స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేకపోయిందని తెలుస్తోంది.