ప్రారంభమైన చంద్రముఖి 2 షూటింగ్.. రజనీకాంత్ బ్లేసింగ్ తీసుకున్న లారెన్స్?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, నయనతార, జ్యోతిక తదితరులు నటించిన చంద్రముఖి సినిమా తెలుగు తమిళ భాషలలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా చంద్రముఖి 2 సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అయ్యింది. ఈ సినిమాలో రజనీకాంత్ స్థానంలో రాఘవా లారెన్స్ నటించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్ పట్టలేక్కింది. ఈ విషయాన్ని లారెన్స్ స్వయంగా వెల్లడించాడు. అయితే ఈ క్రమంలో లారెన్స్ తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ని మర్యాద పూర్వకంగా కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నాడు.

లారెన్స్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ.. రజనీకాంత్ తో ఆశీర్వాదం తీసుకుంటున్న ఫోటోలను కూడా ట్విట్టర్లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. తాజాగా ప్రారంభమైన ఈ సినిమా మొదటి షెడ్యూల్ ని కర్ణాటకలోని మైసూర్ లో షూటింగ్ చేయనున్నారు. మైసూర్ లో దాదాపు 15 రోజుల పాటు రెగ్యూలర్ షూట్ జరగనుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం . 2005లో వచ్చిన చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా రూపొందుతున్న ఈ చంద్రముఖి 2 ని హర్రర్ కామెడీ సినిమాగా వచ్చిన ‘చంద్రముఖి’ని మించి ఉండేలా కథను తయారు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో రజనీకాంత్ పాత్రలో రాఘవా లారెన్స్ కనిపించనున్నాడు.

దీంతో అభిమానులు ఈ సినిమా మీద భారీ అంచనాలను పెట్టుకున్నారు. ముని, గంగ, కాంచన వంటి హర్రర్ సినిమాలలో నటించి ఆకట్టుకున్న లారెన్స్ ఈ సినిమాలో కూడా అదే స్థాయిలో కామెడీని పండించగలడని నమ్మకంతో మేకర్స్ ఈ సినిమా కోసం రాఘవను సెలెక్ట్ చేశారు. ఈ సినిమాలో రాఘవ పాత్రకు సపోర్టింగ్ పాత్రలో ప్రముఖ కమెడియన్ వడివేలు నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు ‘చంద్రముఖి’ పీ వాసు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణీ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల రాఘవ లారెన్స్ గౌరవ డాక్టరేట్ ని అందుకున్నాడు. దీంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.