రాజకీయ అరంగేట్రం పై డిసెంబర్ 31 న తలైవా కీలక ప్రకటన !

సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయం అరంగేట్రంపై ఓ క్లారిటీ వచ్చేసింది. సోమవారం తన అభిమాన సంఘాల నాయకులతో చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణమండపంలో రజినీ సమావేశమయ్యారు. రజనీ మక్కళ్‌ మండ్రం నిర్వాహకులతో సమావేశం నిర్వహించి , ఆ భేటీలో పార్టీ ఏర్పాటు పై ఓ స్పష్టత వచ్చినట్లు తెలుస్తుంది.

తలైవా సొంతగా పార్టీ పెట్టాలని, ఒంటరిగా బరిలోకి దిగాలని ఫ్యాన్స్ కోరగా.. అసెంబ్లీ ఎన్నికలకు సమయం తక్కువగా ఉందని, ఇంత తక్కువ టైంలో పార్టీ బలోపతం అవుతుందా అనే అనుమానాలు వ్యక్తం చేశారు రజినీ. బీజేపీకి మద్దతునిచ్చే అంశం గురించి కూడా సమావేశంలో చర్చ జరిగింది.

వచ్చే ఏడాది ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా తలైవా ప్రకటించారు.జనవరిలో కొత్త రాజకీయ పార్టీ ప్రారంభిస్తున్నట్లు ట్విట్ చేసిన రజినీకాంత్ , డిసెంబర్ 31 న పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. దీనితో రజిని రాజకీయ ఎంట్రీ పై సందిగ్ధం తొలగిపోయింది. రజనీకాంత్‌ రాజకీయ ప్రవేశం సుమారు పాతికేళ్లుగా నలుగుతున్న విషయం. ఆయన రాజకీయాల్లోకి వస్తారా? లేదా? అనే విషయమై 1996వ ఏడాది నుంచి చర్చ జరుగుతుండగా.. మూడేళ్ల క్రితం రజనీ ఆ ఉత్కంఠకు తెరదించారు. ప్రకటన చేసినా క్రియాశీలక రాజకీయాలకు కూడా దూరంగానే ఉన్నారు. దీంతో ఆయన రాజకీయ అరంగేట్రం రాష్ట్ర రాజకీయాల్లో చర్చలకే పరిమితమైంది. ఇక వచ్చే ఏడాది తమిళనాడు లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో రజిని కీలక ప్రకటన చేయడం విశేషం. దీనితో తమిళనాడు రాజకీయాలు శరవేగంగా మార్పులు చెందే అవకాశం కూడా ఉంది.