Pooja Hegde: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే గురించి మనందరికీ తెలిసిందే. తెలుగులో అతి తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాలలో నటించి మెప్పించింది. అలాగే స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. అల్లు అర్జున్, మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇది ఇలా ఉంటే తెలుగులో ఈమె నటించిన సినిమాలు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఫ్లాప్ అవడంతో నెమ్మదిగా ఈమెకు వరుసగా అవకాశాలు తగ్గాయి. దాంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి కాస్త దూరమైన ఈ ముద్దుగుమ్మ నెమ్మదిగా బాలీవుడ్ బాట పట్టింది.
అలా ప్రస్తుతం బాలీవుడ్ కోలీవుడ్ సినిమాలలో నటిస్తూ బిజీబిజీగా ఉంది పూజా హెగ్డే. ఇది ఇలా ఉంటే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా భారీగా తెరకెక్కుతున్న సినిమా కూలీ. నాగార్జున, అమీర్ ఖాన్, శృతిహాసన్, పూజ హెగ్డే, ఉపేంద్ర ఇలా చాలా మంది స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా కూలీ సినిమా ఆగస్టు 14న పాన్ దేశవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన అప్డేట్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి.
ఈ సినిమా కోసం చాలా గట్టిగానే శ్రమించారు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. ఇది ఇలా ఉంటా తాజాగా ఈ సినిమా నుంచి పూజాహెగ్డే స్పెషల్ సాంగ్ రిలీజ్ చేసారు. ఈ పాటను విష్ణు ఏడవన్ రాయగా అనిరుధ్ సంగీత దర్శకత్వంలో సుబలాషిని, అనిరుధ్, అసల్ కోలార్ పాడారు. మోనికా..అంటూ సాగే ఈ పాటలో పూజా హెగ్డే తన అందాలతో అభిమానులను ఆకట్టుకోవడంతో పాటుగా స్టెప్పులు కూడా ఇరగదీసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

