కోలీవుడ్ లో ఇప్పుడు రివర్స్ అయ్యిన కమల్, రజినీల పారితోషకాలు.!

ఒక్క తమిళ నాట మాత్రమే కాకుండా ఇండియన్ సినిమా దగ్గరే బిగ్ స్టార్స్ గా ఉలగనయగన్ కమల్ హాసన్ మరియు రజినీకాంత్ లు ఎప్పుడో నిలిచారు. తమదైన నటన బాక్సాఫీస్ వసూళ్లతో రికార్డులు నమోదు చేసిన వారు ఇప్పటికీ కూడా పాన్ ఇండియా లెవెల్ సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు.

అయితే స్టైల్ అంటే రజిని నటన అంటే కమల్ అనే బ్రాండ్ ఆల్రెడీ ఉంది. కానీ క్రేజ్ పరంగా వసూళ్లు రెమ్యునరేషన్ పరంగా కూడా కమల్ కంటే రజినీ కాంత్ కే ఎక్కువ. కానీ ఈసారి మాత్రం కోలీవుడ్ లో పరిస్థితి రివర్స్ అయ్యినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం కమల్ హాసన్ రజినీకాంత్ కంటే ఎక్కువ మొత్తంలో పారితోషకాన్ని తీసుకుంటున్నారట.

అయితే ఇప్పుడు కమల్ హాసన్ శంకర్ తో “ఇండియన్ 2”, రజినీకాంత్ నెల్సన్ దిలీప్ తో “జైలర్” సినిమాలు చేస్తున్నారు. మరి రజిని అయితే కేవలం ఈ సినిమాకి 70 కోట్లు మాత్రమే పారితోషకం తీసుకుంటుండగా కమల్ అయితే డబుల్ మొత్తంలో ఏకంగా 150 కోట్లు ఇండియన్ 2 కి తీసుకుంటున్నారట.

ఇలా అయితే ఇద్దరు విషయాల్లో ఇప్పుడు పరిస్థితి రివర్స్ అయ్యింది అని కోలీవుడ్ సినీ వర్గాల వారు చెప్తున్నారు. ఇక ప్రస్తుతం అయితే ఈ రెండు సినిమాలు షూటింగ్ లో ఉండగా రెండు సినిమాలకి కూడా అనిరుద్ నే సంగీతం సమకూరుస్తున్నాడు.