ఏమాత్రం తగ్గని రజినీ క్రేజ్..భారీ ధరకు తన సినిమా!

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఒక్క మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. మొత్తం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎన్నో రికార్డులు సెట్ చేసిన తన సినిమాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు రజినీకి కూడా కాస్త గడ్డు కాలం నడుస్తుండగా మళ్ళీ తన ఇమేజ్ ని మ్యాచ్ చేసే అదిరే హిట్ కోసం అంతా ఎదురు చూస్తుండగా దర్శకుడు శివతో “అన్నాత్తే” సినిమాకి ఓకే చేశారు.

దీనితో భారీ అంచనాలు ఈ చిత్రం నెలకొల్పుకుంది. శివ కెరీర్ లో తమిళ నాట భారీ హిట్స్ ఉండడంతో ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ భారీ చిత్రంతో గత కొంత కాలం నుంచి సరైన హిట్స్ లేకున్నా కూడా తన క్రేజ్ మన దగ్గర కూడా చెక్కు చెదరలేదని అర్ధం అవుతుంది. తాజాగా ఈ సినిమా తెలుగు మార్కెట్ థియేట్రికల్ బిజినెస్ ని ముగించినట్టు తెలుస్తుంది.

తెలుగులో ఈ సినిమా హక్కులు 12 కోట్ల వరకు వెళ్లాయట. ఇది రజిని సినెమాలుకు ఇప్పుడు పరిస్థితుల్లో గట్టి ఆఫర్ అనే చెప్పాలి. మన దగ్గర రజినీ సినిమాలు మినిమమ్ ఓపెనింగ్స్ ఇప్పుడుకి కూడా రాబడతాయి. ఇక అన్నీ సెట్టయ్యి రజిని ఇమేజ్ కి తగ్గ హిట్ కానీ అన్నాత్తే అయితే ఈ పన్నెండు కోట్లు కూడా రజినీ దగ్గర జూజూబి..