Rajendra Prasad: సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ఎన్నో సినిమాలలో హీరోగా నటించిన ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు .అయితే ప్రస్తుతం ఈయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా విభిన్నమైన పాత్రలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. త్వరలోనే నితిన్ హీరోగా నటించిన రాబిన్ హుడ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ఈ నెల 28వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ కు పద్మశ్రీ పురస్కారం గురించి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి.
సాధారణంగా పద్మ అవార్డులను ప్రతి ఒక్కరంగంలో ఎంతో మంచి సేవలు చేస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంటుంది. అయితే ఇప్పటివరకు రాజేంద్రప్రసాద్ గారికి పద్మశ్రీ అవార్డు మాత్రం రాలేదు ఇలా ఇప్పటివరకు ఆయనకు రాకపోవడానికి గల కారణం ఏంటనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు రాజేంద్రప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పద్మశ్రీ అవార్డులు అనేవి రాజకీయాలతో ఎంతో ముడిపడి ఉన్నాయి.
మనం వెళ్లి ఎవరినో అవార్డు కావాలి అంటూ అడుక్కోవాలి లేదా రాజకీయాలు చేయాలి ఈ రెండు మనకు రావు అందుకే నాకు ఇప్పటివరకు పద్మశ్రీ అవార్డు రాలేదని రాజేంద్రప్రసాద్ తెలిపారు. నాకు ఇప్పటివరకు పద్మశ్రీ అవార్డు రాకపోవడంతో తాను ఏమీ బాధపడలేదని తెలిపారు. అయితే ఓసారి రామోజీరావు గారు నన్ను పిలిచి నీకు ఎప్పుడైనా పద్మశ్రీ అవార్డు వచ్చిందా అంటూ నన్ను అడిగారు.
ఈ విధంగా రామోజీరావు గారు అడగడంతో నేను లేదని చెప్పాను. రాకపోయినా నువ్వు దాని కోసం ప్రయత్నం చేయకు ఎందుకంటే నువ్వు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఉన్నావు అది పద్మశ్రీ అవార్డు కంటే కూడా చాలా గొప్పదని రామోజీరావు తెలిపారు. నేను ఇప్పుడు పద్మశ్రీ గురించి ఆలోచించడం లేదు అది రావాలి అంటే రాజకీయాలు చేయాలి అది మన వల్ల కాదు అంటూ రాజేంద్రప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.