Rajendra Prasad: రేయ్ దొంగ ము** కొడకా…. డేవిడ్ వార్నర్ పై రెచ్చిపోయిన రాజేంద్రప్రసాద్… ఫైర్ అవుతున్న ఫ్యాన్స్?

Rajendra Prasad: ప్రముఖ సినీ నటుడు నట కిరీటి రాజేంద్రప్రసాద్ ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా ఈయన రాబిన్ హుడ్ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి ఈయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్రదుమారం రేపుతున్నాయి. ఈయన సరదాగే ఇలాంటి మాటలు మాట్లాడినప్పటికీ కూడా హాస్యంగా మాట్లాడటానికి అపహాస్యంగా మాట్లాడటానికి కూడా తేడా తెలియటం లేదా అంటూ అభిమానులు ఒక్కసారిగా ఈయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా జరిగిన రాబిన్ హుడ్ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా రాజేంద్రప్రసాద్ వేదికపై డేవిడ్ వార్నర్ గురించి మాట్లాడుతూ… రేయ్ డేవిడ్ వచ్చి క్రికెట్ ఆడవయ్యా అంటే పుష్ప డైలాగులు వేస్తావా దొంగ ము**” కొడకా నువ్వు మామూలోడివి కాదు రోయ్ వార్నరు అంటూ ఆయన మాట్లాడారు.

అయితే ఈ మాటలు మాట్లాడే సమయంలో రాజేంద్రప్రసాద్ ఫుల్లుగా మద్యం సేవించి ఉన్నారని ఆయన మాట తీరు చూస్తేనే స్పష్టమవుతుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో డేవిడ్ వార్నర్ అభిమానులు రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తాగి వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఎలా అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు సరదాగా మాట్లాడటానికి కూడా కొంతవరకు లిమిట్స్ ఉంటాయి అంటూ రాజేంద్రప్రసాద్ మాటలపై విమర్శలు కురిపిస్తున్నారు.

మరి రాజేంద్రప్రసాద్ గురించి సోషల్ మీడియాలో వస్తున్న ఈ విమర్శలపై ఆయన స్పందన ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది. ఇక వెంకీ కుడుముల దర్శకత్వంలో శ్రీ లీల నితిన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో డేవిడ్ వార్నర్ కూడా ఒక కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా మార్చ్ 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది..