సాయి రోనక్, అంకిత సాహా, బిస్మి నాస్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా రాజయోగం. ఈ చిత్రాన్ని శ్రీ నవబాలా క్రియేషన్స్, వైష్ణవి నటరాజ్ ప్రొడక్షన్స్ పతాకాలపై మణి లక్ష్మణ్ రావు నిర్మిస్తున్నారు. ఒక వైవిధ్యమైన కథాంశంతో దర్శకుడు రామ్ గణపతి రూపొందిస్తున్నారు. తుది హంగులు అద్దుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ 9న విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమం మాస్ కా దాస్వి శ్వక్ సేన్ చేతుల మీదుగా హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత మణి లక్ష్మణ్ రావు మాట్లాడుతూ…మా చిత్ర టీజర్ విడుదల కార్యక్రమానికి అతిథిగా వచ్చిన హీరో విశ్వక్ సేన్ కు కృతజ్ఞతలు. ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగే చిత్రమిది. మా టీమ్ అందరికీ రాజయోగం తెస్తుందని ఆశిస్తున్నాం. రెండు గంటల పాటు ఇంటిల్లిపాదీ నవ్వుకునేలా సినిమా ఉంటుంది. మేము అనుకున్నట్లుగా ఔట్ పుట్ వచ్చింది. అన్నారు.
సంగీత దర్శకుడు అరుణ్ మురళీధరన్ మాట్లాడుతూ…నేను తెలుగులో పనిచేస్తున్న మొదటి సినిమా ఇది. ఇంతకముందు మలయాళంలో కొన్ని చిత్రాలకు సంగీతాన్ని అందించాను. ఈ సినిమాకు మంచి సంగీతాన్ని సమకూర్చే క్రమంలో దర్శకుడు రామ్ గణపతి కావాల్సిన ఎంకరేజ్ మెంట్ ఇచ్చారు. ఈ ఆల్బమ్ హిట్ అవుతుంది అన్నారు. హీరోయిన్ అంకిత సాహా మాట్లాడుతూ…ఈ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టడం సంతోషంగా ఉంది. రాజయోగం సినిమాలోని ఈ పాత్రను నేను చేయగలను అని నమ్మిన దర్శకుడు రామ్ గణపతికి థాంక్స్. డిసెంబర్ 9న మీ ముందుకొస్తున్న మా సినిమాను ఆదరించండి అని చెప్పింది. హీరోయిన్ బిస్మి నాస్ మాట్లాడుతూ…ఒక కొత్త తరహా కంటెంట్ కాన్సెప్ట్ తో మా సినిమా రూపొందింది. నేను కేరళ నుంచి వచ్చాను. తెలుగులో ఫస్ట్ మూవీ ఇది. ఈ ఇండస్ట్రీ కొత్త అయినా దర్శకుడు ఇచ్చిన ఎంకరేజ్ మెంట్ తో సినిమా చేశాను. రాజయోగం ఒక మంచి మూవీ చూసిన అనుభూతిని కలిగిస్తుంది అని చెప్పింది.
దర్శకుడు రామ్ గణపతి మాట్లాడుతూ…రొమాంటిక్ కామెడీ కథతో ఈ సినిమాను రూపొందించాను. ఈ సినిమాలో 100 నుంచి 150 దాకా లిప్ లాక్ సీన్స్ ఉంటాయి. ఫస్టాఫ్ లో వచ్చే లిఫ్ట్ సీన్ మిస్ కావొద్దు. సాయి రోనక్ పక్కింటి కుర్రాడి ఇమేజ్ తో ఇప్పటిదాకా కనిపిచాడు కానీ మాస్ సబ్జెక్ట్ దొరికితే అతను మాస్ హీరో అవుతాడు. ఈ సినిమాలో అతని పర్మార్మెన్స్ సూపర్బ్. ఇద్దరు హీరోయిన్స్ బాగా నటించారు. అంకిత క్యారెక్టర్ కొద్దిగా గ్రే షేడ్ లో ఉంటుంది. విజయ్ సి కుమార్ సినిమాటోగ్రఫీ, అరుణ్ మురళీధరన్ సంగీతం హైలైట్ అవుతాయి. ఈ సినిమాలో పడిందే అని సాగే ఒక స్పెషల్ సాంగ్ ఉంది. ఈ పాటను ఎంఎం శ్రీలేఖ కంపోజ్ చేశారు. థియేటర్ లో ఈ పాట దద్దరిల్లిపోతుంది. సినిమా చూసిన వారెవరూ నిరాశపడరు. మొత్తం మూవీని ఎంజాయ్ చేస్తారు. డిసెంబర్ 9న థియేటర్ కు రండి అన్నారు.
హీరో సాయి రోనక్ మాట్లాడుతూ…మా కార్యక్రమానికి వచ్చిన విశ్వక్ కు థాంక్స్. మా సినిమాలో రొమాన్స్, కామెడీ, యాక్షన్ అన్నీ ఉంటాయి. ఒక డబుల్ మసాలా బిర్యానీ లాంటి సినిమా ఇది. నాకు ఇలాంటి సబ్జెక్ట్ దొరకడం లక్కీ. నాకు ఫైట్స్, డాన్స్ చేయడం ఇష్టం. ఆ అవకాశం ఇంతవరకు రాలేదు. ఈ సినిమాలో డాన్స్, ఫైట్స్ ఎంజాయ్ చేస్తూ చేశా. రెండు గంటలు ఎంటర్ టైన్ అవుతారు అన్నారు.
హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ..ఈ మధ్య జరిగిన అలజడికి వారం రోజులు హిమాలయాలకు వెళ్దామని అనుకున్నా. రోనక్ కు మాటిచ్చా కాబట్టి ఇక్కడికి వచ్చాను. సాయి రోనక్ నాలాగే పక్కా హైదరాబాద్ కుర్రాడు. కొన్ని సినిమాల ఆడిషన్స్ దగ్గర మేము కలిసే వాళ్లం. రోనక్ ఎదగాలని కోరుకునే స్నేహితుడిని నేను. టీజర్ బాగుంది. ఇద్దరు హీరోయిన్స్ ఇంప్రెసివ్ గా ఉన్నారు. పాటలు బాగున్నాయి. టీమ్ అందరికీ బెస్ట్ విశెస్ చెబుతున్నా. నేను చెప్పిన ఏ సూచననూ అర్జున్ గారు పట్టించుకోలేదు. ఆ కథ గురించి మరోసారి డిస్కస్ చేద్దామనే ఆ రోజు షూటింగ్ వద్దని చెప్పాను. ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చి మళ్లీ మొదటి మెట్టుకు దిగజారొద్దనే ఈ జాగ్రత్తలు అంతే గానీ అర్జున్ గారిని అగౌరపరచాలని కాదు. ఆయనకు ఆయన మూవీకి బెస్ట్ విశెస్ చెబుతున్నా అన్నారు.
అజయ్ ఘోష్, ప్రవీణ్, గిరి, భద్రం, షకలక శంకర్, తాగుబోతు రమేష్, చిత్రం శ్రీను, సిజ్జు, మధునందన్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ – విజయ్ సి కుమార్, ఎడిటర్ – కార్తీక శ్రీనివాస్, సంగీతం – అరుణ్ మురళీధరన్, డైలాగ్స్ – చింతపల్లి రమణ, పీఆర్వో – జీఎస్కే మీడియా, సహ నిర్మాతలు – డాక్టర్ శ్యామ్ లోహియా, నందకిషోర్ దారక్, నిర్మాత – మణి లక్ష్మణ్ రావు, రచన దర్శకత్వం – రామ్ గణపతి.