Hero Rajashekar: ఆ స్టార్ హీరోకి బాబాయ్ గా… రాజశేఖర్… సినిమాపై పెరిగిన భారీ అంచనాలు!

Hero Rajashekar: టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ ప్రస్తుతం శేఖర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇలా వరుస ప్రాజెక్టులతో రాజశేఖర్ సినీ కెరీర్ లో బిజీ అయినట్టు తెలుస్తోంది. ఇకపోతే ఆయన హీరోగా మాత్రమే కాకుండా పలు కీలక పాత్రలలో నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా రాజశేఖర్ కి సంబంధించిన సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఒక చిత్రం తెరకెక్కుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇన్ని రోజులు రాజమౌళి RRR సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న తారక్ ఈ సినిమా వాయిదా పడటంతో ఇక తన తదుపరి ప్రాజెక్టు పై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన సినిమా షూటింగ్ పనులను ప్రారంభించనున్నారు.తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ బాబాయ్ పాత్రలో హీరో రాజశేఖర్ నటిస్తున్నట్లు తెలుస్తోంది.

కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ ఇదివరకే జనతాగ్యారేజ్ లాంటి అద్భుతమైన చిత్రాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలోనే మరో సారి వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో హీరో రాజశేఖర్ కూడా ఉన్నారని తెలియడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఇకపోతే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన కియారా అద్వానీ నటిస్తున్నట్లు తెలిసిందే. అయితే ఈ విషయం గురించి చిత్రబృందం త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.