Rajashekar: ఆ సినిమా ఫ్లాప్ అవ్వటానికి నా ఇమేజ్ కారణం అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన రాజశేఖర్..!

Rajashekar: టాలీవుడ్ యాంగ్రీ హీరో రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన నటించిన ఎన్నో సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈయన వందేమాతరం, అంకుశం, భరత సింహారెడ్డి, అల్లరి ప్రియుడు, శివయ్య, గోరింటాకు వంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించిన రాజశేఖర్ కొంతకాలం నటనకు విరామం ఇచ్చాడు. రాజశేఖర్ తన సహ నటి జీవితను 1991వ సంవత్సరంలో వివాహం చేసుకున్నాడు. వీరికి శివానీ, శివాత్మీక అని ఇద్దరు కూతుర్లు ఉన్నారు. శివాత్మిక ఇప్పటికే ఇండస్ట్రీలో అడుగు పెట్టి దొరసాని అనే సినిమాలో కథానాయిక పాత్రలో నటించింది.

రాజశేఖర్ కొంత కాలం సినిమాలకు విరామం ఇచ్చిన తర్వాత ఇటీవల గరుడవేగ సినిమా ద్వారా మళ్లీ హీరోగా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది. దీని తర్వాత రాజశేఖర్ నటించిన కల్కి సినిమా నిరాశపరిచింది. ప్రస్తుతం రాజశేఖర్ శేఖర్ సినిమాలో నటించాడు. ఈ సినిమ ఒక మలయాళ సినిమాని రీమేక్ చేశారు. తాజాగా రాజశేఖర్ నటించిన శేఖర్ సినిమా విడుదల అయ్యింది. ఈ సినిమాలో రాజశేఖర్ కూతురు శివత్మిక కూడ ప్రధాన పాత్రలో నటించారు.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అనేక ఇంటర్వ్యూలకు హాజరైన రాజశేఖర్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ” రీమేక్ సినిమాలు చేయటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అని, సినిమాలు రీమేక్ చేయడం వల్ల అందులోని నటీనటులు పాత్రలు ఎలా ఉంటాయి అన్న విషయం గురించి స్పష్టత వచ్చి ఇంకా బాగా నటించేందుకు మంచి అవకాశం ఉంటుందని వెల్లడించారు. కొన్ని సందర్భాలలో స్క్రిప్ట్ మార్చవలసి ఉంటుంది. లేదంటే వాటిని ప్రేక్షకులు ఆదరించారు. నేనూ నటించిన శేషు సినిమా కూడ అలాగే జరిగింది. తమిళ సినిమా రీమేక్ చేసి శేషు సినిమా ఉన్నది ఉన్నట్టుగా తీసినందువల్ల ప్రేక్షకులకు నచ్చలేదు. అప్పట్లో నాకు ఉన్న ఇమేజ్ కి అటువంటి పాత్ర చేయటం వల్ల ఆ సినిమా ఫ్లాప్ అయింది ” అంటూ రాజశేఖర్ వెల్లడించారు.