ఏ రంగంలోనైనా కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకోవాలని అనుకుంటే తీవ్రంగా శ్రమించాలనే సంగతి తెలిసిందే. స్టార్ హీరోల వారసులు సైతం ప్రస్తుతం 25 సంవత్సరాల వయస్సు తర్వాతే సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అయితే 18 ఏళ్ల వయస్సులోనే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కెరీర్ ను మొదలుపెట్టారు. తొలి సినిమాతోనే జూనియర్ ఎన్టీఅర్ నటుడిగా మంచి మార్కులు వేయించుకున్నారు.
స్టూడెంట్ నంబర్1 సినిమాతో తొలి సక్సెస్ ను జూనియర్ ఎన్టీఆర్ అందుకోగా రాజమౌళి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అయితే రాఘవేంద్ర రావు ఈ సినిమాకు దర్శకత్వ పర్యవేక్షణ చేయడంతో రాఘవేంద్రరావు ఈ సినిమాకు దర్శకుడు అని వార్తలు ప్రచారంలోకి రావడంతో రాజమౌళికి స్టూడెంట్ నంబర్1 సినిమా సక్సెస్ సాధించినా అవకాశాలు రాలేదు. సింహాద్రి సినిమాతో తారక్ రాజమౌళి కాంబో రిపీట్ అయింది.
సింహాద్రి సినిమా భారీ అంచనాలతో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. సింహాద్రి, సింగమలై పాత్రల్లో ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించారు. అయితే ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేయాలని కొంతమంది రజనీకాంత్ కు చూపించారు. రజనీకాంత్ ఈ సినిమాను చూసి జూనియర్ ఎన్టీఆర్ ఇంత చిన్న వయస్సులో ఈ రేంజ్ మాస్ సినిమాలు చేయడం కరెక్ట్ కాదని ఇలాంటి సినిమాలు కెరీర్ పై ఎఫెక్ట్ చూపుతాయని చెప్పారట.
రజినీకాంత్ ఊహించిన విధంగానే సింహాద్రి తర్వాత ఎన్టీఆర్ నటించిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. మళ్లీ యమదొంగ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే కథలపై దృష్టి పెట్టి సినిమాలతో సక్సెస్ సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఎన్టీఆర్ కొత్త ప్రాజెక్ట్ లు పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్నాయి.