Rajamouli: సాయం చేయమని కోరిన జక్కన్న.. భారీగా ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు.. కారణం ఏమిటంటే?

Rajamouli: రాజమౌళి అనగానే తెలుగే కాదు ఇండియా మొత్తం బాగా పాపులర్. బాహుబలి క్రేజ్ రాజమౌళి స్టేటస్ ను ప్రపంచవ్యాప్తంగా పెంచేసింది. భారీ బడ్జెట్ తో సినిమా లు తీసే రాజమౌళి ట్విట్టర్ లో చేసిన ట్వీట్ ఇపుడు ట్రోల్ కి గురవుతోంది. విషయంలోకి వెళితే బాహుబలి మూవీ ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లో కూడా క్రేజ్ సంపాదించుకుని రాజమౌళికి మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే ఆ సినిమా టైంలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చూసుకున్న దేవిక ఇపుడు కాన్సర్ తో పోరాడుతోంది. తన వైద్యానికి అయ్యే ఖర్చు కోసం రాజమౌళి తన ట్వీట్ ద్వారా విరాళం అడిగారు.

మంచిపని కోసమే సహాయం అడిగిన ఈ ట్వీట్ తో ట్రోల్ కి గురవుతున్నారు. చాలా మంది నెటిజన్స్ ఈ ట్వీట్ కి రిప్లై గా అయన మీద ఘాటుగానే సటైర్లు వేస్తున్నారు.భారీ బడ్జెట్ సినిమాలు తీస్తూ పేరు సంపాదిస్తున్నారు పైగా కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకునే మీకు దేవిక వైద్యానికి అయ్యే ఖర్చు పెద్దదేం కాదని కొందరు కామెంట్ చేస్తే మరికొందరు సహాయం అడిగే ముందు మనం చేయాలి అంటూ చురకలేసారు. నిజంగానే రాజమౌళి తలచుకుంటే దేవికకు జరగాల్సిన ఆపరేషన్ పెద్ద విషయం కాదు. పోనీ కోట్లలో ఖర్చవుతుంది అనుకుంటే తనకు వీలైనంత సహాయం చేసి మీవంతుగా ఇవ్వండి అని అడిగి ఉంటే విషయం వేరేలా ఉండేదేమో.

ఈ క్రమంలోనే ఈ విషయంపై నెటిజన్లు పెద్దఎత్తున ఆగ్రహానికి దీంతో సోషల్ మీడియా వేదికగా జక్కన్నను భారీగా ట్రోల్స్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా వాయిదా తర్వాత జక్కన్న మహేష్ బాబుతో తన తదుపరి ప్రాజెక్ట్ కు సిద్ధమవుతున్నవారు. ఇందులో విలన్ గా గోపీచంద్ ను సంప్రదించారని సమాచారం. మరి రాజమౌళి గురించి ఈ ట్వీట్ పై వచ్చే ట్రోల్స్ గురించి జక్కన్న ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.