Rajamouli : నట సింహం నందమూరి బాలకృష్ణతో జక్కన్న రాజమౌళి సినిమా చేస్తే ఎలా వుంటుంది.? ఈ ఆలోచన నందమూరి అభిమానుల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతోంది. అయితే, జక్కన్న రాజమౌళి సినిమా స్టైల్ వేరు.. నందమూరి బాలకృష్ణ ఆలోచనలు వేరు. బోయపాటి శ్రీనుకి తెలిసినంతగా బాలయ్య పల్స్ పట్టుకోవడం రాజమౌళికి సాధ్యం కాదేమోనన్న అనుమానాలు ఓ వైపు, బాలయ్యను హ్యాండిల్ చేయడం రాజమౌళికి అంత తేలిక కాదనే చర్చలు ఇంకో వైపు కనిపిస్తున్నాయి.
ఇంతకీ, ఈ విషయమై బాలయ్య ఏమంటాడు.? రాజమౌళి ఎలా సమాధానం చెబుతాడు.? రాజమౌళితో సినిమా ఎప్పుడు.? అన్న ప్రశ్నకు, నందమూరి బాలకృష్ణ నవ్వేసి ఊరుకున్నారు తాజాగా. ఈ మౌనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? అని ప్రశ్నిస్తే, ముసి ముసి నవ్వులు నవ్వేశారు బాలయ్య. అంటే, తెరవెనుకాల ఏదో చిన్నపాటి చర్చ అయితే రాజమౌళి – బాలయ్య మధ్య జరిగి వుండాలి. జరిగే వుంటుంది.. జరగకుండా ఎందుకు వుంటుంది.?
అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం బాలయ్య – రాజమౌళి సినిమా కోసం ఓ పెద్ద నిర్మాత తెరవెనుక సన్నాహాలు చేస్తున్నారట. ఆ ప్రయత్నాలు ఫలించి బాలయ్య – రాజమౌళి త్వరలోనే చేతులు కలుపుతారని అంటున్నారు. రెండు పెద్ద బ్యానర్లు ఈ సినిమా కోసం రంగంలోకి దిగబోతున్నాయని సమాచారం. అందులో ఒకటి, నందమూరి బాలయ్య సొంత బ్యానర్.. అనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.
నిజమేనా.? అసలు రాజమౌళి అంత ఖాళీగా వున్నాడా.? మహేష్‌బాబుతో సినిమా చేయాలి.. ఆ తర్వాత అల్లు అర్జున్‌తో రాజమౌళి ఓ సినిమా చేసే అవకాశం వుంది.. ఇవన్నీ దాటి రాజమౌళి – బాలయ్య సినిమా షురూ అవ్వాలంటే.. ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాకపోవచ్చు.