Rajamouli: మహేష్ ఈ లక్షణం మార్చుకో…. సూపర్ స్టార్ కి వార్నింగ్ ఇచ్చిన రాజమౌళి?

Rajamouli: సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఎంతో మంచి క్రేజ్ ఉంది. కృష్ణ వారసుడిగా బాల నటుడు గానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ బాబు ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. చిన్నప్పటినుంచి సినిమాలంటే ఎంతో ఆసక్తి ఉన్న ఈయన సినిమాల పట్ల ఎంతో డెడికేషన్ చూపిస్తారు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే .ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇక ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులు జరుపుకుంటున్నా, ఎక్కడ షూటింగ్ జరుగుతుంది ఏంటి అనే విషయాలు మాత్రం బయటకు రావడం లేదు. రాజమౌళి తన సినిమాల విషయంలో ఇలాంటి జాగ్రత్తలు చాలా బాగా తీసుకుంటారు కనీసం ఈ సినిమా పూజ కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలను కూడా బయటకు విడుదల చేయలేదు. ఇలా ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్న నేపథ్యంలో మహేష్ బాబుకి రాజమౌళి సీరియస్ వార్నింగ్ ఇచ్చారని తెలుస్తుంది.

సూపర్ స్టార్ కే వార్నింగ్ ఇచ్చే అంత తప్పు మహేష్ ఏం చేశారనే విషయానికి వస్తే సినిమాల పట్ల ఎంతో నిబద్ధత కలిగి ఉన్న మహేష్ బాబు డూప్ లేకుండా సినిమాలలో నటిస్తారట. ఎలాంటి యాక్షన్ సీన్స్ అయినా డూప్ అవసరం లేదని చెప్పి ఈయనే సాహసాలు చేస్తూ ఉంటారు కానీ అది చాలా ప్రమాదకరమని ఇదివరకు ఎంతోమంది డైరెక్టర్లు చెప్పినా మహేష్ మాత్రం ఆ అలవాటు మానుకోలేదట.

ఇక రాజమౌళి సినిమాలో కూడా ఇలాంటి యాక్షన్ సీన్స్ ఉన్న నేపథ్యంలో డూప్ లేకుండా చేస్తానని మహేష్ చెప్పడంతో జక్కన్న సీరియస్ అయ్యారని తెలుస్తుంది. ముందు నువ్వు ఇలాంటి అలవాట్లను మార్చుకోవాలని, కొన్ని సన్నివేశాలలో డూప్ సహాయంతోనే నటించాల్సి ఉంటుందని సీరియస్గా చెప్పినట్లు తెలుస్తోంది. ఇలా రాజమౌళి వంటి ఒక స్టార్ డైరెక్టర్ చెప్పడంతో మహేష్ కూడా సైలెంట్ అయ్యారని సమాచారం.