రామ్ చరణ్ చేతలు, ఎన్టీఆర్ మాటలు.. ఇదే రాజమౌళి ఫార్ములా

Rajamouli sharing between Ram Charan, NTR
Rajamouli sharing between Ram Charan, NTR
 
ఎస్.ఎస్.రాజమౌళి రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో మల్టీస్టారర్ అనగానే అంత పెద్ద స్టార్ హీరోలు ఇద్దరినీ ఒకే సినిమాలో సమతూకంగా ఎలా చూపిస్తారు రాజమౌళి అనే అనుమానం అందరిలోనూ కలిగింది.  ఎందుకంటే ఇద్దరు హీరోల్లో ఏ హీరోకి లెవల్ తగ్గినా ఆ హీరో అభిమానులు సినిమాను తిప్పికొట్టే అవకాశం ఉంది.  అదే జరిగితే మొత్తం సినిమానే దెబ్బతింటుంది. 
 
కాబట్టి రాజమౌళి ఈ బ్యాలెన్స్ కోసం కొత్త పద్ధతిని అనుసరించాలి.  అదే చేస్తున్నారు ఆయన.  ముందు ఇద్దరు హీరోల్లో ఎవరి బలాలు ఏంటో బేరీజు వేసుకున్నారు ఆయన.  రామ్ చరణ్ మాస్ ఫిగర్.  యాక్షన్ కంటెంట్ రక్తి కట్టించగలడు.  పోరాట సన్నివేశాల్లో గూస్ బంప్స్ తెప్పించగలడు.  మాస్ ప్రేక్షకులకు ఇది చాలు. 
 
ఇక తారక్ విషయానికి వస్తే మంచి వాగ్దాటి గల నటుడు.  అలవోకగా పేజీ డైలాగ్ చెప్పగలడు.  ఇప్పటికే యమదొంగ లాంటి సినిమాల్లో ఆ సంగతి ప్రూవ్ అయింది.  మాటకతోనే హీరోజమ్ ఎలివేట్ చేయగలడు.  అందుకే ఈ ఇద్దరికీ రెండు పోర్షన్స్ ఇచ్చేశారట రాజమౌళి. 
 
రామ్ చరణ్ మీద ఫైట్స్ బ్రహ్మాండంగా కంపోజ్ చేసి ఎన్టీఆర్ కు ఏమో పేజీల కొద్ది డైలాగ్స్ రాయించారట.  ఇలా ఎవరి ప్లస్ పాయింట్స్ మీద వారికి న్యాయం చేస్తున్నారట.  ఇలా చేయడం మూలన అభిమానులు సైతం సంతృప్తి చెందుతారనేది రాజమౌళి ఆలోచన.  మరి చూడాలి ఆయన స్ట్రాటజీ ఈమేరకు వర్క్ అవుతుందో.