రాజమౌళి, ప్రభాస్… స్టైల్ మారాల్సిందే

Rajamouli, Prabhas should try new genre
Rajamouli, Prabhas should try new genre
టాలీవుడ్ సూపర్ హిట్ కాంబినేషన్లలో రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ ఒకటి. వీరి కలయికలో వచ్చిన ‘ఛత్రపతి, బాహుబలి 1, బాహుబలి 2’ చిత్రాలు భారీ బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. మూడుసార్లు కలసి పనిచేసిన ఈ ఇద్దరూ నాల్గవసారి చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నారని ఫిల్మ్ నగర్ టాక్. రాజమౌళి ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ చేస్తున్నారు. అది కంప్లీట్ అవ్వగానే మహేష్ బాబుతో వర్క్ చేస్తారు. ఈ సినిమా ఏ జానర్లో ఉంటుందో ఇంకా క్లారిటీ లేదు.  ఈ సినిమా తర్వాత రాజమౌళి ప్రభాస్ తో వర్క్ చేస్తారట.  
 
వీరు కలిసి సినిమా చేస్తారనే వార్తకంటే చేస్తే ఎలాంటి సినిమా చేస్తారు అనేదే ఆసక్తికరమైన విషయంగా మారింది.  వీరిద్దరూ ఆల్రెడీ ‘ఛత్రపతి’ రూపంలో యాక్షన్ ఫిల్మ్, ‘బాహుబలి’ రూపంలో ఎపిక్ అడ్వెంచర్ చేసేశారు.  రాజమౌళి ప్రజెంట్ చేసున్న ‘ఆర్ఆర్ఆర్’ ఫిక్షనల్ పిరియాడికల్ డ్రామా. ప్రభాస్ ఏమో అవతల ‘రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్’ అంటూ యాక్షన్, రొమాంటిక్, ఎపిక్ జానర్లను అలాగే నాగ్ అశ్విన్ సినిమాతో సైన్స్ ఫిక్షన్ జానర్ చేస్తున్నారు.  సో.. ఇద్దరూ కలిసి పాపులర్ జానర్లను టచ్ చేసినట్టే.  మరి వీరి కొత్త సినిమాకు కొత్తగా ఉండటానికి ఏదైనా కొత్త జానర్ ఎంచుకుంటారో లేకపోతే పాత వాటిల్లోనే దేన్నైనా రిపీట్ చేస్తారో చూడాలి.