Madhavi Latha: ఇప్పటివరకు తన కెరీర్‌లో పెద్ద హీరో సినిమా తనకు వచ్చి వెళ్లిపోయిన వాటి గురించి నటి మాధవీ లత ఓ ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు. వరుడు సినిమా విడుదలయ్యాక దర్శకుడు గుణశేఖర్ గారు తనను పిలిచి ఆ సినిమాలో తనతో అనుకున్నామని ఆయన చెప్పినట్టు మాధవీ లత చెప్పారు. అంతే కాకుండా ఆ పాటను ఇద్దరు తెలుగు అమ్మాయిలతో తెరకెక్కించాలని అనుకున్నామని, వాళ్లలో ఒక నటి బిందు మాధవి, ఇంకొకరు తనతో చేపిద్దామని అలా అయితే బాగుంటుందని అనుకున్నట్టు గుణశేఖర్ అన్నారట. అదే డేట్స్‌లో తనకు స్నేహితుడా సినిమాకు సంబంధించి ఓ సాంగ్ షూటింగ్ ఉంది అని ఆమె చెప్పారు.
అయితే అప్పుడు తనకు ఇండస్ట్రీ గురించి అంతగా తెలియకపోవడం వల్ల డేట్స్ కుదరదని చెప్పినట్టు ఆమె అన్నారు. అదీ గాక బిందు మాధవి కూడా బిజీగా ఉన్నారని తెలిసిందని ఆమె చెప్పారు. అందుకే ఎవరూ లేకుండా ఓ మామూలు సాంగ్‌లో ఆ సినిమాలో పెట్టారని ఆమె స్పష్టం చేశారు. ఒకవేళ మేమిద్దరం ఓకే అయితే తను ఒక చరణంలో ఇంకో చరణంలో మరో నటి ఉండేవాళ్లని ఆమె అన్నారు.
ఇకపోతే తాను ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో, ఎలాంటి ట్రయల్స్ కూడా చేయని సమయంలో మాత్రం ఒక పీఆర్ నుంచి తనకు తెలిసిన విషయం ఏమిటంటే యమదొంగ సినిమాలో యంగ్ యమా సాంగ్‌కి అమ్మాయిల్ని వెతుకుతున్నారని. అది నిజమా కాదా అనేది మాత్రం తనకు తెలియదని జస్ట్ అతను చెప్పడం వల్ల మాత్రమే తనకు తెలిసిందని ఆమె వివరణ ఇచ్చారు. ఆ సాంగ్‌కి సంబంధించి కొత్త అమ్మాయిలను చూస్తున్నారని, కొంచెం ఐటెం సాంగ్‌లా ఉంటుంది. అందులో ముగ్గురుంటారని కూడా చెప్పారని మాధవీ లత అన్నారు. అది విని తాను ఒప్పుకోలేదని ఆమె అన్నారు. నిజం చెప్పాలంటే తనకు రాజమౌళి గారి గురించి అప్పుడు అంతగా తెలియదని, కేవలం హీరోల గురించి మాత్రం తెలిసేదని ఆమె చెప్పారు.